Chiranjeevi : నిజంగానే చిరంజీవి మోహన్ బాబు మద్య ఇంత ఉందా? ఈ డైమండ్ బాబు మాటలు నిజమేనా?
Chiranjeevi : ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చిరంజీవి మరియు మోహన్ బాబుల మధ్య కోల్డ్ వార్ ఓ స్థాయిలో జరుగుతుంది అంటూ క్లారిటీ వచ్చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీ పెద్దలతో మరియు స్టార్స్ తో చర్చించేందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి తనతో పాటు మహేష్ బాబు, ప్రభాస్ ఇంకా కొందరు దర్శకులను మాత్రమే తీసుకు వెళ్లారు. కానీ మోహన్ బాబు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా తీసుకు వెళ్ళ లేదు అనే టాక్ వినిపిస్తోంది. తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ నాన్నగారిని ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ కొందరు ఆయనకు ప్రభుత్వ ఆహ్వానం అందకుండా చేశారు అది ఎవరో కూడా నాకు తెలుసు అన్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశాడు.మంచు విష్ణు వ్యాఖ్యలు కచ్చితంగా చిరంజీవి గురించే అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలోభాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు డైమండ్ రత్నబాబు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.. చిరంజీవి మరియు మోహన్ బాబు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్నాఫ్ ఇండియా సినిమా కోసం చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని నేను భావించాను. ఆ విషయాన్ని మోహన్ బాబు గారి దగ్గర వెళ్లడించాను. అప్పుడు మోహన్ బాబు గారు స్వయంగా చిరంజీవి గారికి ఫోన్ చేసి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా కోరాడు.మోహన్ బాబు గారు అడిగిన మరుసటి రోజే చిరంజీవి గారు వచ్చి వాయిస్ ఇచ్చారు. ఇద్దరి మధ్య అలాంటి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మీడియాలో రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు
అంటూ దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పుకొచ్చాడు. చిరంజీవి మరియు మోహన్ బాబుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగానే బయట కనిపిస్తాయి. త్వరలో జరగబోయే సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చిరంజీవి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఇద్దరు కలిసి కౌగిలించుకుంటారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఇద్దరు బాహాటంగా ఎప్పుడు కూడా తిట్టుకోరు.. కాని మోహన్ బాబుకు ఖచ్చితంగా చిరుపై కోపం ఉంటుంది. అందుకే వీళ్లది కోల్డ్ వార్ అంటారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు కు ఆ విషయం తెలియక వాళ్ళిద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది అంటున్నాడు. ఆయనకు కనిపిస్తున్నది నిజమైన స్నేహం కాదని ఆయన అర్థం చేసుకోవాల్సి ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.