Kalyan Krishna : అక్కినేని హీరోలకు హిట్స్ ఇచ్చినా ఈ దర్శకుడికి అవకాశాలు కరువయ్యాయి..?

Authored By vamana sai | The Telugu News | Published on: May 28, 2022, 4:30 pm

Kalyan Krishna : ఈ మధ్యకాలంలో హిట్ ఇస్తున్న దర్శకులకు ఎందుకనో మళ్ళీ అవకాశాలు దక్కడం లేదు. అలా అలా రేస్‌లో వెనకబడిపోతున్నారు కొందరు టాలెంటెడ్ డైరెక్టర్స్. అలాంటి వారిలో కళ్యాణ్ కృష్ణ కురసాల ఒకరు. ఆయన అక్కినేని స్టార్ హీరోలకు వరుసగా రెండు మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. 2016లో అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్‌లో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్‌గా కళ్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాగార్జున బాడీ లాంగ్వేక్‌కు తగ్గట్టు చక్కటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని యమలోకంతో ముడిపెట్టి అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు కళ్యాణ్ కృష్ణ కురసాల.

ఆయన మొదటి చిత్రం భారీ హిట్ సాధించడంతో ఆ తర్వాత నాగ చైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘రారండోయ్ వేడుకచూద్దాం’ అనే మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసి మరో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే, మరో హిట్ కోసం సినిమాగా మాస్ మహారాజా రవితేజతో ‘నేల టికెట్’ తీసి అనూహ్యంగా
ఫ్లాప్ చూశారు. ఈ సినిమా రవితేజకు పెద్ద మైనస్ అయితే, ఇదే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మాళవిక శర్మ అడ్రస్ లేకుండా పోయింది. దాంతో కాస్త గ్యాప్ వచ్చేసింది. ఇక నాగార్జున సోగాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ చేద్దామని ఆఫర్ ఇచ్చారు.

Director Kalyan Krishna Not Happy

Director Kalyan Krishna Not Happy

Kalyana Krishna : పాన్ ఇండియా రేంజ్‌లో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడా..?

దాంతో దాదాపు ఈ ప్రాజెక్ట్ మీద నాలుగేళ్ళు శ్రమించారు. నాగార్జునను మెప్పించడానికి కొంత సమయం పడితే కరనా కారణంగా మరికొంత సమయం పట్టింది. ఏదేమైనా ఈ దర్శకుడు ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్ళీ సాలీడ్ హిట్ అందుకున్నారు. అక్కినేని హీరోలు కింగ్ నాగార్జున – నాగచైతన్య హీరోలుగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించారు. కళ్యాణ్ కృష్ణకు ఈ సినిమాతో మచి పేరే వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ దర్శకుడు చెప్పిన కథలు మన హీరోలకు నచ్చడం లేదా లేక పాన్ ఇండియా రేంజ్‌లో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడా..! అనేది క్లారిటీ లేదు.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp