Naga Chaitanya : తండ్రీ ఎదుటే నాగచైతన్య చిలిపి చేష్టలు.. క్లారిటీనిచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ..
Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఇటీవల ‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో చేసిన చిలిపి పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసి నాగచైతన్యలోనూ నిజమైన సోగ్గాడున్నాడని, సమంత పోతే ఏం.. దక్ష వచ్చేసిందని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవన్నీ విషయాలను ‘బంగార్రాజు’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల వద్దకు వెళ్లగా, ఆయన స్పందించాడు. నాగచైతన్య స్టేజీ మీద చేసిన చిలిపి పని గురించి వివరణ ఇచ్చాడు.
‘బంగార్రాజు’ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతున్న సమయంలో నాగచైతన్య అనుకోకుండా వెనక్కి తిరిగి చూశాడు. దాంతో వెంటనే అక్కడే ఉన్న హీరోయిన్ దక్ష నగార్కర్ కళ్లు ఎగరేసింది. దాంతో నాగచైతన్య తెగ సిగ్గుపడిపోయాడు. ఇక ఆ వీడియోను మీమర్స్, ట్రోలర్స్ తెగ యూజ్ చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు నాగచైతన్యని, రసికుడని రకరకాల కౌంటర్స్ వేస్తున్నారు. కాగా, ఈ విషయమై కళ్యాణ్ కృష్ణ స్పందిస్తూ..నాగచైతన్య స్వభావం గురించి చెప్పాడు. నాగచైతన్య బంగారమని, ఆయనతో తాను ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు పని చేశానని, ఇప్పుడు రెండో సారి పని చేశానని పేర్కొన్నాడు. ఆయన 24 క్యారెట్స్ కాదని, 48 క్యారెట్స్ బంగారమని చెప్పుకొచ్చాడు.

kalyan krishna given clarity on naga chaitanya daksha video bangarraju event
Naga Chaitanya : నాగచైతన్య ఎవరిని చూసినా అలానే చేస్తారన్న డైరెక్టర్..
నాగచైతన్యలో ఉన్న క్లారిటీ మనలో ఉంటే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తామని అన్నాడు. ఇకపోతే నాగచైతన్య ‘బంగార్రాజు’ ఈవెంట్‌లో ఏదో సౌండ్ అయిందని నాగచైతన్య వెనక్కి తిరిగి చూశాడని, దాంతో దక్ష కళ్లు ఎగరేసిందని తెలిపిన కళ్యాణ్ కృష్ణ కురసాల.. నాగచైతన్య ఎవరిని చూసినా అలానే నవ్వుకుని సిగ్గు పడతాడని అన్నాడు. అలా అసలు విషయమదేనని వివరించాడు డైరెక్టర్. ఇకపోతే చిత్రంలో నాగచైతన్య కృష్ణుడి వంటి పాత్రను పోషించాడని, ఇప్పటి వరకు రాముడి పాత్రలను నాగచైతన్య పోషించాడని తెలిపాడు. ఈ పిక్చర్‌లో నాగచైతన్యకు జోడీగా బ్యూటిఫుల్ భామ కృతిశెట్టి నటించింది.