Malavika Mohanan : ఇదంతా ఫేక్ న్యూస్..గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్ క్లారిటీ

Authored By vamana sai | The Telugu News | Published on: May 28, 2022, 3:30 pm

Malavika Mohanan : తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాలో కీలక పాత్ర పోషించింది మాళవిక మోహనన్. హీరోయిన్ పాత్ర కాకపోయినా ఈ చెన్నై చిన్నదానికి మంచి క్రేజ్ దక్కింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. అయితే, ఈ క్రేజ్ ఆమెకు అంతగా పనిచేయలేదు. మాస్టర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు గడుస్తున్నా కూడా మాళవికకు అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో గానీ ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కలేదు. కానీ, హిందీలో మాత్రం ఓ సినిమాలో నటించే అవకాశం దక్కింది.

కానీ, ఈ విషయం కంటే ముందు అమ్మడికి మరో సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా మాళవిక మోహనన్ క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఫర్హాద్ సమ్జీ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ ‘వీరం’ ఆధారంగా హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కలిసి ‘కభీ ఈద్ కబీ దివాళీ’ సినిమా మొదలవోతోంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే ..విలన్‌గా జగపతి బాబు నటించనున్నారు. అయితే, ఇదే సినిమాలో సల్మాన్ ఖాన్ తమ్ముడిగా సిద్ధార్ధ్ నిగమ్ నటిస్తుండగా, అతనికి జంటగా మాళవిక మోహనన్ ఎంపికైందని వార్తలు వచ్చాయి.

This is fake News Malavika Mohanan Clarity

This is fake News Malavika Mohanan Clarity

Malavika Mohanan : ఆ సినిమాతోనే అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ జరగాల్సింది.

కానీ, ఇది కంప్లీట్‌గా ఫేక్ న్యూస్. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక వెల్లడించింది. ఈ సినిమాలో తాను నటించడం లేదని..అవన్నీ గాలి వార్తలని క్లారిటీ ఇచ్చింది. కాగా, మాళవిక యుధ్రా సినిమా ద్వారా హిందీ సీమలో ఎంట్రీ ఇస్తోంది. ఈ
మూవీ కోసం అమ్మడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. అలాగే, తెలుగులో గ్లోబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతుండగా అందులో ఓ హీరోయిన్‌గా మాళవిక నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా విజయ్ దేవరకొండ హీరోగా హీరో అనే సినిమా ప్రకటన కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది. ఆ సినిమాతోనే అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ జరగాల్సింది.

vamana sai

No bio available for this author.

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp