నువ్వు నేను సినిమాలోకి ఉదయ్ కిరణ్ అలా.. నేల మీద కూర్చుని డైరెక్టర్ తేజను పడేశాడు!!

0
Advertisement

చిత్రం సినిమాతో దర్శకుడు తేజ పేరు టాలీవుడ్‌లో ఓ సంచలనంగా మారింది. తేజ దర్శకుడిగా మారక ముందు కెమెరామెన్‌గా పని చేశాడన్న సంగతి తెలిసిందే. వర్మ సినిమాలకు తేజ కెమెరామెన్‌గా పనిచేశాడు. అలాగే ఎన్నో హిందీ సినిమాలకు కూడా పని చేశాడు. అలా అలా తేజ దర్శకుడిగా మారాడు. చిత్రం సినిమాతో టాలీవుడ్‌లో ఓ ముద్ర వేసుకున్నాడు. చిత్రం సినిమాతో దాదాపు తొమ్మిది మంది కొత్తవాళ్లను ఇండస్ట్రీకి తేజ పరిచయం చేశాడు.

Director Teja selecting Uday Kiran Nuvvu Nenu
Director Teja selecting Uday Kiran Nuvvu Nenu

హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కమెడియన్స్, ఇతర ఆర్టిస్ట్‌లు ఇలా ఎంతో మందిని మొదటి సినిమాతో నిలబెట్టేశాడు. చిత్రం సినిమా అయితే బాగానే హిట్టయింది. కానీ ఉదయ్ కిరణ్‌కు మళ్లీ రెండో అవకాశం మాత్రం రాలేదట. అయితే తేజ ఆ సమయంలో నువ్వు నేను సినిమా చేసే పనుల్లో బిజీగా ఉండేవాడట. నువ్వు నేను సినిమా కోసం పెద్ద పెద్ద వాళ్లను తేజ అప్రోచ్ అయ్యాడట. ముఖ్యంగా మాధవన్‌ను తీసుకోవాలని ఆశపడ్డాడట. కానీ మాధవన్ తెలుగు సినిమాలు చేసేందుకు అంగీకరించలేదట.

అలా తేజ హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఉదయ్ కిరణ్ కూడా తనకు అవకాశాలు రావడం లేదని తేజ ఆఫీస్ చుట్టే తిరుగుతూ ఉండేవాడట. రోజూ ఆఫీస్‌లోకి రావడం, అలా మూలన కూర్చోవడం తేజ ఓ కంట గమనిస్తూనే ఉన్నాడట. ఇక హీరోలు కూడా సెట్ కాకపోవడంతో.. నువ్వే చేసేయ్యవయ్యా అని ఉదయ్ కిరణ్‌కు తేజ అవకాశం ఇచ్చాడట. అలా రెండో సినిమా నువ్వు నేనుతో టాలీవుడ్‌లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగేశాడు. ఎంత ఫాస్ట్‌గా ఎదిగాడో.. అంతే త్వరగా వెనక్కివచ్చాడు. చివరకు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్నాడు.

Advertisement