Sada : ఆ ఒక్క కారణం ‘ తో పెళ్లి చేసుకోలేదు .. జన్మలో చేసుకోను – హీరోయిన్ సదా !

Advertisement

Sada : టాలీవుడ్ లోకి ‘ జయం ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సదా మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో సదా కి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ మొదటి సినిమాతో వచ్చిన గుర్తింపు తర్వాత సినిమాలతో తెచ్చుకోలేకపోయింది. దీంతో సదా సినిమాలకు దూరంగా ఉండిపోయింది కానీ ప్రస్తుతం బుల్లితెరలో పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఇటీవల తేజ ‘ అహింస ‘ సినిమాలో సదా కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

Advertisement

అయితే ప్రస్తుతం సదా వయసు 40 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో సదా పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది అయితే తాజాగా సదా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పెళ్లి చేసుకోలేదు కాబట్టే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. నాకు వైల్డ్ లైఫ్ అంటే ఇష్టం. జంతువులను ఎక్కువగా ప్రేమిస్తాను. పెళ్లయితే నా అభిరుచికి తగ్గట్లు నడుచుకోవడం కుదరదు. పెళ్లయితే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కండిషన్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్లో పెళ్లిళ్లు అస్సలు నిలబడటం లేదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది కదా అని అన్నారు.

Advertisement
eroin sada comments about her marriage
eroin sada comments about her marriage

దీన్ని బట్టి చూస్తే సదా కి పెళ్లి చేసుకుని ఆలోచన లేనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. శోభన, టబు, నగ్మా, అనుష్క ఇలా వీరంతా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ సదా చేరింది. ఈమె కూడా పెళ్లి చేసుకోనట్లే కనిపిస్తోంది. ఇక సదా వైల్డ్ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఎప్పుడైనా ఖాళీ దొరికితే అడవికి వెళ్లి పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను తన కెమెరాలో బంధిస్తుంటుంది. ఇలా తన లైఫ్ ని సింగిల్గానే ఎంజాయ్ చేస్తూ వస్తుంది.

Advertisement
Advertisement