Pushpa 2: స‌మంత స్థానంలో అల‌రించ‌నున్న ఐటెం బ్యూటీ ఎవ‌రో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pushpa 2: స‌మంత స్థానంలో అల‌రించ‌నున్న ఐటెం బ్యూటీ ఎవ‌రో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

Pushpa 2: అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోను అద‌ర‌గొట్టింది. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు సౌత్‌లో ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో దానికి డబుల్‌ రేంజ్‌లో నార్త్‌లో ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఒక రకంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి దేశానికి చాటి చెప్పింది పుష్ప. బన్నీ యాక్టింగ్‌, డైలాగ్‌లు మొదలు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 March 2022,8:00 pm

Pushpa 2: అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోను అద‌ర‌గొట్టింది. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు సౌత్‌లో ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో దానికి డబుల్‌ రేంజ్‌లో నార్త్‌లో ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఒక రకంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి దేశానికి చాటి చెప్పింది పుష్ప. బన్నీ యాక్టింగ్‌, డైలాగ్‌లు మొదలు పాటల వరకు ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ క్రమంలోనే సమంత నటించిన ‘ఊ అంటావా’ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో స‌మంత రేంజ్ కూడా పెరిగింది.

disha patani in pushpa 2

disha patani in pushpa-2

దిశాని సెట్ చేశారా..!

తొలి పార్ట్‌లో స‌మంత త‌న డ్యాన్స్ తో అద‌రగొట్ట‌గా సెకండ్ పార్ట్‌లో స్పెష‌ల్ సాంగ్ ఎవ‌రు చేయ‌బోతున్నార‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ రెండో పార్ట్‌లో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ని టాక్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ ఐటెమ్‌ సాంగ్‌కి సంబంధించి ఇప్పటికే దిశాతో చర్చలు జరిగాయని, అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. బాలీవుడ్‌లో దిశాపటానీకి స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటూ హాట్‌ బాంబ్‌గా పేరుతెచ్చుకుంది.

disha patani in pushpa 2

disha patani in pushpa-2

ఇటీవల వచ్చిన `రాధే`లో ఆమె గ్లామర్‌ పోతకి బాలీవుడ్‌ మొత్తం ఫిదా అయ్యింది. ఆటంబాంబ్‌కి సరైన అర్థాన్నిచ్చే దిశాపటానీతో ఐటెమ్‌ సాంగ్‌ అంటే ఆ క్రేజ్‌, ఊపు మామూలుగా ఉండదు. అందుకే సెకండ్‌ పార్ట్ లో దిశాపటానీతో స్పెషల్‌ సాంగ్‌ చేయాలని భావిస్తున్నారట. ‘పుష్ప: ది రైజ్‌’ మూవీ గతేడాది క్రిస్మిస్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకురామ్‌-అల్లు అర్జున్‌ కాంబోలో పాన్‌ ఇండియా చిత్రంగా పుష్ప తెరకెక్కింది. ఈ మూవీ సీక్వెల్‌గా పుష్ప: ది రూలర్‌ పార్ట్‌ 2 ప్రస్తుతం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండే పార్ట్‌ 1 విడుదలకు ముందే పాటలు, ట్రైలర్‌తో సన్సెషన్‌ క్రియేట్‌ చేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది