Sudigali Sudheer : రెండు రోజులు మాట్లాడుకోలేదు, ఏడ్చాం హగ్ చేసుకున్నాం.. సుడిగాలి సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ
Sudigali Sudheer : సుధీర్ రష్మీ గత పదేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరి మధ్య ఏమీ లేదని జనాలకు అర్థమైనా కూడా ఏదో మ్యాజిక్ ఉందని ఫీలవుతుంటారు. ఈ ఇద్దరిని తెరపై జోడిగా చూడాలని అందరూ ఆశిస్తుంటారు. ఇక నిజ జీవితంలోనూ ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుతుంటారు.
తాజాగా ఈ ఇద్దరూ కలిసి స్టార్ మా చేస్తోన్న హోళీ ఈవెంట్‌కు వచ్చారు. ఇందులో యాంకర్ రవి అడిగిన ప్రశ్నలకు రష్మీ సమాధానాలు చెప్పింది. తమ రిలేషన్ గురించి రష్మీ చెప్పిన విషయాలు వింటే ఎవ్వరికైనా హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయి. ఈ పదేళ్లలో తమది హెల్దీ రిలేషన్ షిప్‌లానే ఉండేది.. కానీ ఆ ఒక్క గొడవ వల్ల రెండ్రోజులు మాట్లాడుకోలేదు అని రష్మీ చెప్పుకొచ్చింది.

Rashmi Gautam Shares Emotional Incident With Sudigali Sudheer
Sudigali Sudheet : సుధీర్‌పై రష్మీ ప్రేమ..
ఆ తరువాత షూటింగ్ కోసం సెట్‌కు వచ్చాం.. నాకు ఇష్టమైన స్వీటు ఒకటి ఉంటుంది.. దాన్ని నా దగ్గరకు పంపించాడు.. ఏడ్చాం, హగ్ చేసుకున్నాం.. అంటూ తమ రిలేషన్ గురించి రష్మీ చెప్పుకొచ్చింది. మరి ఆ గొడవ ఏంటన్నది ఎపిసోడ్‌లో చూపిస్తారో లేదో. మొత్తానికి చాలా రోజుల తరువాత రష్మీ సుధీర్ ఇలా ఓ ఈవెంట్‌లో కలిసి సందడి చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
