
disha patani in pushpa-2
Pushpa 2: అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం పుష్ప. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ చిత్రం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోను అదరగొట్టింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు సౌత్‌లో ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చిందో దానికి డబుల్ రేంజ్‌లో నార్త్‌లో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఒక రకంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి దేశానికి చాటి చెప్పింది పుష్ప. బన్నీ యాక్టింగ్, డైలాగ్‌లు మొదలు పాటల వరకు ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలోనే సమంత నటించిన ‘ఊ అంటావా’ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సమంత రేంజ్ కూడా పెరిగింది.
disha patani in pushpa-2
తొలి పార్ట్‌లో సమంత తన డ్యాన్స్ తో అదరగొట్టగా సెకండ్ పార్ట్‌లో స్పెషల్ సాంగ్ ఎవరు చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. `లోఫర్` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ రెండో పార్ట్‌లో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ ఐటెమ్ సాంగ్‌కి సంబంధించి ఇప్పటికే దిశాతో చర్చలు జరిగాయని, అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. బాలీవుడ్‌లో దిశాపటానీకి స్పెషల్ క్రేజ్ ఉంది. అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటూ హాట్ బాంబ్‌గా పేరుతెచ్చుకుంది.
disha patani in pushpa-2
ఇటీవల వచ్చిన `రాధే`లో ఆమె గ్లామర్ పోతకి బాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. ఆటంబాంబ్‌కి సరైన అర్థాన్నిచ్చే దిశాపటానీతో ఐటెమ్ సాంగ్ అంటే ఆ క్రేజ్, ఊపు మామూలుగా ఉండదు. అందుకే సెకండ్ పార్ట్ లో దిశాపటానీతో స్పెషల్ సాంగ్ చేయాలని భావిస్తున్నారట. ‘పుష్ప: ది రైజ్’ మూవీ గతేడాది క్రిస్మిస్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకురామ్-అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా చిత్రంగా పుష్ప తెరకెక్కింది. ఈ మూవీ సీక్వెల్‌గా పుష్ప: ది రూలర్ పార్ట్ 2 ప్రస్తుతం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండే పార్ట్ 1 విడుదలకు ముందే పాటలు, ట్రైలర్‌తో సన్సెషన్ క్రియేట్ చేసింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.