dj tillu Movie First Day collectionsdj tillu Movie First Day collections
Dj Tillu Movie :ఇటీవలి కాలంలో కొన్నచిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా సిద్దు జొన్నలగ్డ హీరోగా రూపొందిన డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా మంచి ఆదరణపొందాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో సిద్ధూ యాటిట్యూడ్, హీరోయిన్ అందచందాలు జనాల్లోకి వెళ్లిపోయాయి. మాస్ అంశాలతో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ట్రైలర్‌ను కట్ చేయడంతో ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం మాత్రం ఊహించని రేంజ్‌లో వసూళ్లు రాబట్టింది.
రవితేజ ఖిలాడి సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడంతో మొదటి రోజే తేలిపోయింది ఇది దాంతో టిల్లు రప్ఫాడిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో డిజే టిల్లు మొదటి రోజు 3 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు.. ఉన్న అంచనాలకు.. చేసిన బిజినెస్‌కు.. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్‌కు ఎక్కడా పొంతన లేదు. తొలి రోజు ఈ సినిమా నైజాం: 1.59 కోట్లు, సీడెడ్: 0.47 కోట్లు, ఉత్తరాంధ్ర: 0.26 కోట్లు, ఈస్ట్: 0.18 కోట్లు, వెస్ట్: 0.14 కోట్లు, గుంటూరు: 0.15 కోట్లు, కృష్ణా: 0.11 కోట్లు, నెల్లూరు: 0.10 కోట్లు సాధించింది.
dj tillu Movie First Day collections
మొత్తంగా ఏపీ, తెలంగాణ ఫస్డ్ డే కలెక్షన్స్: 3.00 కోట్లు సాధించగా, రెస్టాఫ్ ఇండియా: 0.50 కోట్లు, ఓవర్సీస్: 0.90 కోట్లు సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 4.40 కోట్లు సాధించినట్టు సమాచారం.కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ .. డైరెక్టర్ విమల్ కృష్ణ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు . గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సిద్దు. ఆ తర్వాత కృష్ణ ఎండ్ హిస్ లీల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డీజే టిల్లు గా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.