Shooting : ఛి ఛీ షూటింగ్ మధ్యలో ఇలా చేస్తారా ? ఇంత బరితెగించారా ?

Authored By Breaking News | The Telugu News | Published on: April 27, 2023, 11:00 am

Shooting : సినిమా పరిశ్రమ అనేది ప్రజలకు వినోదాన్ని కలిగించేది. ఈ క్రమంలో భారతదేశంలో చాలా చలనచిత్ర పరిశ్రమలు ఉన్నాయి. బాధ్యతాయుతంగా నటీనటులు సినిమా సెట్స్ లో వ్యవహరిస్తే అంతా సవ్యంగా ఉంటే బాగానే ఉంటది. కానీ ఏమాత్రం తోటి నటీనటులపై అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం ఎక్కడికి అక్కడ అసోసియేషన్ లు పలు చర్యలు తీసుకుంటాయి. ఈ క్రమంలో కొన్నిచోట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై జీవితకాలం నిషేధం కూడా విధిస్తుంటాయి. దీంతో సినిమా అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటది.

ఈ రకంగానే మలయాళ చలనచిత్ర పరిశ్రమలో వర్ధమాన నటులైన షేన్ నిగమ్ – శ్రీనాథ్ బసిని షూటింగ్ విరామ సమయంలో ఒక దరిద్రమైన పని చేసి… జీవిత కాలం పాటు సినిమాలో ఛాన్సులు పోగొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ఇద్దరు నటీనటులు గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమా సెట్స్ లో డ్రగ్స్ తీసుకునేవారట. ఆ తరువాత ఆ మత్తుకి తోటి నటీనటులపై అసభ్యంగా ప్రవర్తించటంతో షేన్ నిగమ్ – శ్రీనాథ్ బసిని నీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్

Do you do this in the middle of Chi Chi shooting

Do you do this in the middle of Chi Chi shooting

ఆఫ్ కేరళ – కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ ఇద్దరు నటులను మలయాళ చిత్రాల్లో నటించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా సెట్స్ లో దూరాలవాట్లకు చెడు ప్రవర్తనకు… అడ్డుకట్ట వేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ పెద్దలు స్పష్టం చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో చీచీ … అని కేరళ సినీ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. వారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని… సినిమా సెట్స్ లో డ్రగ్స్ తీసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp