Vishakapatnam..కాశీపట్నంలో సినిమా షూటింగ్ సందడి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishakapatnam..కాశీపట్నంలో సినిమా షూటింగ్ సందడి

 Authored By praveen | The Telugu News | Updated on :8 September 2021,7:00 pm

జిల్లాలోని అనంతగిరి మండలం కాశీపట్నం జీసీసీ గోడౌన్ వద్ద బుధవారం షూటింగ్ సందడి నెలకొంది. సినిమా మేకర్స్ ఈ ప్లేస్‌లో ‘మోదమాంబ ఫ్యాషన్ షాపు, రాఘవేంద్రా కిరాణా దుకాణం’ పేరుతో సెట్‌లను ఏర్పాటు చేశారు. ఈ సెట్‌లలో సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సెట్‌లతో పాటు ఇందులో నటించే హీరో హీరోయిన్స్, నటులను చూసేందుకు జనాలు తరలివచ్చారు. ఈ సినిమాలో జొన్నలగడ్డ సిద్ధు హీరో కాగా హీరోయిన్‌గా అనిక నటిస్తోంది.

అరకు-విశాఖ పట్నం హైవే రోడ్‌కు ఆనుకుని మూవీ షూటింగ్ జరుగుతుండటంతో రోడ్డుపై అటుగా వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులు ఆగి మరీ షూటింగ్ ప్రాంతం వైపునకు తరలి వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. సెట్‌లను చూసి జనాలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం రియల్ ఫ్యాషన్ షాపు, జనరల్ స్టోర్స్ లాగానే సెట్‌లు ఉన్నాయని అంటున్నారు. రియలిస్టిక్ సెట్స్ ఈ ప్రాంతంలో ఈజీగా వేసుకోవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ సినిమా షూటింగ్స్‌కు అనుకూలంగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.

 

Advertisement
WhatsApp Group Join Now

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది