Jabardasth Hyper Aadi: దాదాపు లక్షన్నర జీతంతో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఇండస్ట్రీ మీద ఆసక్తితో బుల్లితెరవైపు వచ్చి పాపులర్ అయి జబర్దస్త్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ లో ఆదికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్కిట్స్‌లో తన మార్క్ పంచులతో పొట్ట చక్కలయ్యేలా నవ్విస్తున్నాడు ఆది. ఈ క్రేజ్ తో అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తున్నాడు. అయితే మంచి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకొని జబర్దస్త్ కి వచ్చి పొరాపాటు చేశాడని చాలామంది మాట్లాడుకున్నారు.
కానీ ఇక్కడికి వచ్చాకే హైపర్ ఆది బాగా సంపాదించాడని తన ఇల్లు.. ఆస్తులను సంపాదించాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరికున్న క్రేజ్ వల్ల జబర్దస్త్ కామెడీ షోలో రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ తో పాటు, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోస్ కూడా చేస్తున్న వీరికి మల్లెమాల వారు మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారట. నెలకు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
హైపర్ ఆది సంపాదన మొత్తంగా చూస్తే ఏడాదికి కోటి దాటిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. తాజాగా వినాయక చవితి ఈవెంట్‌లో తన రియల్ లైఫ్‌పై ఓ డాన్స్ ప్రోగ్రామ్ చేసారు.
ఈ క్రమంలోనే తన ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఊర్లో ఆయనకున్న ఆస్తుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఆది చదువుకునేప్పుడే చాలా ఖర్చులు అయ్యాయని, అప్పట్లోనే 20 లక్షల వరకు అప్పు అయిందని గుర్తు చేసుకున్నాడు. ఆది చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేటప్పుడు తన తండ్రి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని డబ్బు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత హైపర్ ఆది అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసాడు.
అభి ద్వారా జబర్దస్త్ షోలో అవకాశం అందుకున్నాడు. స్క్రిప్ట్స్ తో నవ్విస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నాడు. కానీ గతంలో తమ అప్పులు కట్టడానికి ఉన్న మూడు ఎకరాలు అమ్మేసాడట ఆది వాళ్ల నాన్న. అయితే ఆది జబర్దస్త్‌కు వచ్చిన తర్వాత అదే ఊరిలో మళ్ళీ ఏకంగా 16 ఎకరాలు కొన్నాడట. అంతేకాదు తండ్రి చేతికి పది వేళ్లకు పది ఉంగరాలు కూడా చేయించాడు. అలాగే హైదరాబాద్‌లోనూ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు. బాల్కానీలో కూర్చుని అలా సిటీని చూస్తూ కొత్త కొత్త ఐడియాలు రాగానే స్క్రిప్ట్స్ రాసుకుంటానని తెలిపాడు. అయితే ఆదికి ఉన్న ఆస్థుల గురించి బయట జరుగుతున్న ప్రచారంలో కొంత మాత్రమే నిజం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.