Home » Entertainment » Do You Know Anchor Suma Have Her Own Production House
Entertainment

Anchor Suma : యాంకర్ సుమ ఒక్క విషయంలో దారుణంగా ఫ్లాప్ అయ్యింది.. ఏంటో తెలుసా?

Authored By
aruna
The Telugu News | Published on: September 21, 2022, 8:30 pm
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ ఈమె గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సుమ ఎంతటి స్టార్డం దక్కించుకుందో అందరికీ తెలిసిందే. వెండి తెర బుల్లి తెర పై తనదైన ముద్ర ను వేసి ప్రస్తుతం బుల్లి తెరపై తన మహారాణి ప్రస్థానం లో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆమె అడుగు పెట్టిన ప్రతి చోట కూడా సక్సెస్ అని అనుకుంటారు. ఆమె ఏ షో చేసినా కూడా సూపర్ హిట్ అయినట్లే భావిస్తారు. ఇంతటి సక్సెస్ రేట్ దక్కించుకున్న ఈ యాంకరమ్మ తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో చేసిన కార్యక్రమం మాత్రం దారుణమైన పరాజయం పాలవడంతో తీవ్రమైన నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.

Advertisement

దాదాపు పది సంవత్సరాల క్రితం యాంకర్ సుమ ఒక కార్యక్రమాన్ని తన సొంత నిర్మాణంలో ప్రారంభించింది. సుమ భర్త రాజీవ్ కనకాల కి ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు మంచి స్నేహితుల అనే విషయం తెలిసిందే. అందుకే సుమ సొంత ప్రొడక్షన్ హౌస్ లో ప్రారంభమైన కార్యక్రమానికి అప్పట్లో ఎన్టీఆర్ రావడం చర్చినీయాంశంగా మారింది. ఏకంగా ఎన్టీఆర్ ని అప్పట్లో తీసుకు వచ్చిన సుమ సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత కూడా రెండు మూడు కార్యక్రమాలను తన సొంత నిర్మాణంలో తీసుకు వచ్చింది. కానీ అవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.

do you know anchor suma have her own production house

Advertisement

కాన్సెప్ట్ లో విభిన్నంగా ఉన్నా కూడా అదృష్టం కలిసి రాలేదో లేక మరి ఏమైందో కానీ సుమ నిర్మాణం లో వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. ఏ ఒక్కటి కూడా సంవత్సరానికి మించి సాగలేదు అనడంలో సందేహం లేదు. సుమ వేరే వారి నిర్మాణంలో చేసిన కార్యక్రమాలు మాత్రమే సూపర్ హిట్ అవుతున్నాయి. కానీ తన సొంత బ్యానర్లో చేసిన ఏ ఒక్క కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వలేదు. ముందు ముందు సుమ మళ్లీ ఏదైనా తన సొంత బ్యానర్ లో సినిమా లేదా కార్యక్రమాన్ని చేస్తుందా అనేది చూడాలి. అప్పుడైనా ఆమెకు సక్సెస్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి