
Allu Arjun Birthday : అల్లు అర్జున్ ఆస్తులు ఎంతో తెలుసా.. బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువే..!
Allu Arjun Birthday : అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ Pan India Star హీరో. ఒకప్పుడు వీడు హీరో ఏంట్రా అన్న వారితోనే.. హీరో అంటే ఇలాగే ఉండాలి
అనిపించుకున్నాడు. విమర్శించిన నోళ్లతోనే.. శభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే ఇదంతా ఒక్క రోజులో జరిగింది.. దీని వెనకాల అల్లు అర్జున్ Allu Arjun ఎన్నో రాత్రుళ్లు కష్టపడ్డాడు. నిత్య కఠోర శ్రమ తర్వాతనే ఆయన ఇప్పుడు అందరిచేత హీరో అనిపించుకుంటున్నాడు. ఈ స్థాయికి రావడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఒక్కో సినిమాతో తనలోని ట్యాలెంట్ ను ప్రజలకు రుచి చూపించాడు. ఇప్పుడు పుష్పరాజ్ గా పాన్ ఇండియాను ఏలుతున్నాడు.
ఇంతటి స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, ఆయనకున్న లగ్జరీ వస్తువుల గురించి ఒకసారి తెలుసుకుందాం. బన్నీ Bunny గ్యారేజీలో అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి రేంజ్ రోవర్ వోగ్, దీని ధర దాదాపు రూ. 2.5-4 కోట్లు. మరో హమ్మర్ హెచ్2 ధర దాదాపు రూ.75 లక్షలు. దాంతో పాటు బన్నీ దగ్గర జాగ్వార్ ఎక్స్ జెఎల్ కారు కూడా ఉంది. దానికి తోడు వోల్వో ఎక్స్‌సి 90 టి8 ఎక్సలెన్స్ వంటి కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. బన్నీకి కార్లు అంటే చాలా ఇష్టం. ఏదైనా కొత్తకారు ఆయనకు నచ్చితే వెంటనే కొనేస్తుంటాడు.అయితే కార్లు మాత్రమే కాదండోయ్.. ఆయన వద్ద ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. అతను తన కుటుంబంతో కలిసి జెట్ లో ట్రిప్‌లకు వెళ్తాడు. ఇక బన్నీకి జూబ్లీహిల్స్ లో బ్లెస్సింగ్ అనే అల్లు బంగ్లా ఉందతి. ఇది అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంది.
Allu Arjun Birthday : అల్లు అర్జున్ ఆస్తులు ఎంతో తెలుసా.. బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువే..!
దీన్ని 2 ఎకరాల స్థలంలో రూ.100 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందులోనే స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్, బార్ జోన్, పిల్లల కోసం ప్లే గ్రౌండ్ కూడా ఉంది. దాంతో పాటు ఆయనకు వానిటీ వ్యాన్ కూడా ఉంది. ఇది చాలా లగ్జరీ వ్యాన్. దీని ధర 7 కోట్లు ఉంటుందని సమాచారం. విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్‌లో ఇది కూడా ఒకటి. ఇక అల్లు అర్జున్ నిఖర ఆస్తుల విలువ వచ్చేసి రూ.430 కోట్లు. పుష్ప ది రైజ్ కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.50 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇక రెండో పార్టు కోసం ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇలా ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
This website uses cookies.