Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ వివాహ నిశ్చితార్థం నిన్న వైభవంగా జరిగింది. హైదరాబాదులోని ఒక హోటల్ లో శర్వానంద్ మరియు రక్షితా రెడ్డి ల యొక్క నిశ్చితార్థం జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు నిన్నటి నుండి తెగ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే శర్వానంద్ తీసుకుంటున్న కట్నం ఎంత అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. రక్షితా రెడ్డి యొక్క తండ్రి హైకోర్టు లాయర్. ఆయన సుదీర్ఘ కాలంగా పలు వ్యాపారాల్లో ఉన్నారట, అంతే కాకుండా రక్షితా కూడా ప్రముఖ అమెరికా బేస్డ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది. కనుక రక్షితా రెడ్డి యొక్క ఆస్తులు భారీగానే ఉండి ఉంటాయి.
రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో శర్వానంద్ కి కట్నం రూపంలో భారీగానే దక్కి ఉంటుంది అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. అయినా శర్వానంద్ కి కట్నం తీసుకోవాల్సిన అవసరం లేదు. హీరోగా చాలా సంవత్సరాలుగా శర్వానంద్ కొనసాగుతున్నాడు. ఆయన సినిమాలు సక్సెస్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మినిమంగా ఆడుతూనే ఉంటాయి. దాంతో ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున శర్వానంద్ చేస్తున్నాడు. తద్వారా భారీగానే ఆయన సంపాదించి ఉంటాడు. కనుక భార్య తీసుకు వచ్చే కట్నంపై ఆయనకు పెద్దగా ఆశ ఉండక పోవచ్చు. అత్త మామ ఏమైనా కానుకలుగా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ కట్నంగా మాత్రం శర్వానంద్ తీసుకొని ఉండడు అనేది ఆయన అభిమానుల మాట.
మొత్తానికి శర్వానంద్ రియల్ హీరోగా నిలిచి కట్నం తీసుకోలేదా.. లేదంటే భారీ కట్నం తీసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఎంగేజ్మెంట్ కి రామ్ చరణ్, ఉపాసన ఇంకా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు హాజరవ్వడంతో మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరిగింది. కనుక శర్వానంద్ పెళ్లి గురించి మరియు ఆయన తీసుకుంటున్న కట్నం గురించి ప్రముఖంగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ వేసవిలోనే శర్వానంద్, రక్షితా రెడ్డి యొక్క పెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ సమయంలో అయినా శర్వానంద్ కట్నం గురించి అఫీషియల్ గా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.