Hero Sharwanand : హీరో శర్వానంద్ కాబోయే భార్య… హీరో సిద్ధార్థకి ఏమవుతుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hero Sharwanand : హీరో శర్వానంద్ కాబోయే భార్య… హీరో సిద్ధార్థకి ఏమవుతుందో తెలుసా..?

 Authored By sekhar | The Telugu News | Updated on :27 January 2023,10:20 am

Hero Sharwanand : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో శర్వానంద్ ఒకరు. అయితే గురువారం శర్వాకీ .. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షిత రెడ్డికి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -ఉపాసన, చిరంజీవి-సురేఖ, నాగార్జున- అమల, అక్కినేని అఖిల్ ఇంకా టాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇక ఇదే వేడుకకు హీరో సిద్ధార్థ మరియు హీరోయిన్ ఆదితీ హైదరి కలిసి రావటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. త్వరలో పెళ్లి పీటలేకబోతున్న ఈ జంటను ఆశీర్వదించడం జరిగింది. ఇదిలా ఉంటే హీరో శర్వానంద్ కి కాబోయే భార్య రక్షిత రెడ్డి సిద్ధార్థకీ అంతకుముందే క్లోజ్ ఫ్రెండ్ అనీ టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు శర్వానంద్ భార్య గోల్డ్ మెడలిస్ట్ అని కూడా అంటున్నారు.

Do you know what will happen to Hero Siddhartha the future wife of Hero Sharwanand

Do you know what will happen to Hero Siddhartha, the future wife of Hero Sharwanand

కాగా హీరో సిద్ధార్థ మరియు ఆదితీ హైదరి మధ్య ప్రేమ ఉన్నట్లు గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శర్వానంద్ నిశ్చితార్థానికి… సిద్ధార్థ..హైదిరితో కలసిరావటం సంచలనం సృష్టించింది. సిద్ధార్థకి గతంలోనే  ఆల్రెడీ పెళ్లయింది. తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అదితి హైదరితో… పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో హీరో శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలో హీరో సిద్ధార్థ… సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది