Home » Entertainment » Do You Know The Favorite Dishes Of Chiranjeevi Prabhas And Mahesh Babu
Entertainment

Tollywood Stars : చిరంజీవి, ప్ర‌భాస్, మ‌హేష్ బాబు ఇష్టంగా తినే వంట‌కాలు ఏంటో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 18, 2022, 4:30 pm
Advertisement

Tollywood Stars : సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక త‌మ అభిమాన హీరోల గురించి అనేక విష‌యాలు తెలుసుకుంటున్నారు అభిమానులు. ఇన్నాళ్లు తెలియ‌ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో వాటిపై ఓ లుక్కేస్తున్నారు. అయితే ఫుడ్ విషయంలో త‌మ అభిమాన‌ హీరోలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక విష‌యాలు ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విష‌యానికి వ‌స్తే… చిరంజీవి మొదటి నుంచి మంచి ఫుడీ. ఆయనకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అది కూడా అమ్మ చేసిన చేపల వేపుడు అంటే ప్రాణం. ఇక కొన్నిరకాల బిర్యానీలు కూడా బాగా ఇష్టంగా తింటారు చిరంజీవి.

Advertisement

ముఖ్యంగా రొయ్యలంటే అసలే వదిలిపెట్టరు. ఇక బాలయ్య మంచి భోజన ప్రియుడు . రొయ్యల బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తింటారు బాలయ్య. నాటు కోడి పులుసు కూడా బాగా ఇష్టపడతారట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఫుడ్ ను బాగా ఆస్వాదిస్తారు. ఇష్టమైన ఫుడ్ ను మితంగా తింటారు పవన్. పవన్ కళ్యాణ్ కు నాటు కోడి పులుసు అంటే చాలా ఇష్టం. సూపర్ స్టార్ మ‌హేష్ బాబుకు ఇష్టమైన ఫుడ్ మెనూలో ఫిష్ సూప్ తో పాటు.. ప్రత్యేకంగా తయారు చేసిన హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంది. ఇదే ఆయన హెల్త్ సీక్రేట్. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా.. మితంగా తింటారు మహేష్.

Do you know the favorite dishes of Chiranjeevi, Prabhas and Mahesh Babu

Advertisement

Tollywood Stars : భోజ‌న ప్రియులు..

అల్లు అర్జున్ ఎంత‌ భోజన ప్రియుడో చాలా సార్లు ఆయనే చెప్పారు. బన్నీకి చాలా ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. అన్ని రకాల హైదరాబాడ్ బిర్యానీలను అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజు గారి పులావ్ అంటే చాలా ఇష్టమట. పులావ్ లో కోడిపులావ్ ఒక్కటనే కాదు.. పులావ్ లో ఎన్ని వెరైటీలు ఉన్నా.. అన్నింటిని ఆస్వాదిస్తారట ప్రభాస్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నాటు కోడి కీమాతో పాటు నాటుకోడి పులుసు.. హలీమ్ లను ఎంజాయ్ చేస్తారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పప్పు, ఆవకాయ, అప్పడం, నెయ్యి, ఉంటే చాలు ఆరోజు పండగేనట. అంతే కాదు ఐస్ క్రీమ్ లు కూడా చాలా ఇష్టంగా తింటారట చరణ్. ఇలా మ‌న హీరోలు ఫుడ్‌ని తెగ ఎంజాయ్ చేస్తారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి