
do you know these movies are left by mahesh babu
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన చేసిన చివరి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్ కమింగ్ సినిమాల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని మహేశ్ భావించినట్టు తెలుస్తోంది. మహేశ్ తన 22ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. సాధారణంగా ప్రిన్స్‌కు ప్లాఫులు అంటే నచ్చవని తెలుస్తోంది. ఒక్కసారి ఫ్లాపు వచ్చిందంటే మళ్లీ ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు మహేశ్ ఇష్టపడరని తెలుస్తోంది.
ఈ విషయాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకానొక సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.మహేశ్‌కు పూరి రెండు భారీ హిట్లు ఇచ్చాడు. రాజకుమారుడితో కెరీర్ ప్రారంభించిన మహేశ్ ‘పోకిరి’ సినిమా వరకు ఒకే మ్యానరిజాన్ని, స్లో వాయిస్ డైలాగ్ చెప్పడాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే పూరి ప్రాజెక్టు ఒప్పుకున్నారో అప్పటినుంచి మహేశ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ టైమింగ్ అన్ని మారిపోయాయి. టాలీవుడ్‌లో ఒకేసారి సంచలనం సృష్టించారు.
do you know these movies are left by mahesh babu
అయితే, మహేశ్ తాను వరుసగా సినిమాలు చేస్తున్న టైంలో కొన్ని సినిమాలను వదులుకున్నారు. అందులో కొన్ని పట్టాలెక్కాక కూడా వదిలేసినట్టు తెలుస్తోంది. ఆ మూవీస్ ఎంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..‘అర్జున్’ మూవీ తర్వాత ఎంఎస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ డైరెక్షన్‌లో ‘సైన్యం’ మూవీ ప్రారంభం కాగా, ‘సైనికుడు’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఆ మూవీ ఆగిపోయింది.
అలాగే ‘వీడు చాలా హాట్ గురూ’ సినిమాను ‘ఒక్కడు’ అసిస్టెంట్ డైరెక్టర్ జాస్తి హేమంబర్ దర్శకత్వంలో రావాల్సి ఉన్నా ‘ఖలేజా’ లేట్ అవ్వడంతో అది పట్టాలెక్కలేదు.ఇక బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ మూవీ రావాల్సి ఉండగా అది కూడా పట్టాలెక్కలేదు. మహేష్ , కరిష్మా కపూర్ జంటగా ‘మిస్టర్ ఫర్‌ఫెక్ట్’ చేయాలని అనుకున్నా.. ‘దూకుడు’ మూవీకి ఓకే చెప్పడంతో కార్యరూపం దాల్చలేదు. ఇక మహేష్ – మణిరత్నం కాంబోలో ఓ సినిమా చేయాలనుకున్నా కుదరలేదు.
ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘హరేరామ – హరేకృష్ణ’ సినిమా అనుకున్నారు కానీ పట్టాలెక్కలేదు. ప్రిన్స్‌కు రెండు భారీ హిట్లు అందించిన పూరితో ‘జనగణమన’ చేయాలనుకున్న ఆ టైంలో పూరి వరుస ప్లాఫులతో పీకల్లోతూ కష్టాల్లో ఉండటంతో మహేశ్ మరో సినిమా చేసేందుకు వెనకడుగేశారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.