Mahesh Babu : మహేశ్ బాబు మధ్యలో వదిలేసిన సినిమాలు ఎంటో తెలుసా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : మహేశ్ బాబు మధ్యలో వదిలేసిన సినిమాలు ఎంటో తెలుసా..!

 Authored By mallesh | The Telugu News | Updated on :11 November 2021,9:50 pm

Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన చేసిన చివరి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్ కమింగ్ సినిమాల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని మహేశ్ భావించినట్టు తెలుస్తోంది. మహేశ్ తన 22ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. సాధారణంగా ప్రిన్స్‌కు ప్లాఫులు అంటే నచ్చవని తెలుస్తోంది. ఒక్కసారి ఫ్లాపు వచ్చిందంటే మళ్లీ ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు మహేశ్ ఇష్టపడరని తెలుస్తోంది.

ఈ విషయాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకానొక సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.మహేశ్‌కు పూరి రెండు భారీ హిట్లు ఇచ్చాడు. రాజకుమారుడితో కెరీర్ ప్రారంభించిన మహేశ్ ‘పోకిరి’ సినిమా వరకు ఒకే మ్యానరిజాన్ని, స్లో వాయిస్ డైలాగ్ చెప్పడాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే పూరి ప్రాజెక్టు ఒప్పుకున్నారో అప్పటినుంచి మహేశ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ టైమింగ్ అన్ని మారిపోయాయి. టాలీవుడ్‌లో ఒకేసారి సంచలనం సృష్టించారు.

do you know these movies are left by mahesh babu

do you know these movies are left by mahesh babu

Mahesh Babu : పట్టాలెక్కిన తర్వాత ఆగిన మహేశ్ ప్రాజెక్ట్స్ ఇవే..

అయితే, మహేశ్ తాను వరుసగా సినిమాలు చేస్తున్న టైంలో కొన్ని సినిమాలను వదులుకున్నారు. అందులో కొన్ని పట్టాలెక్కాక కూడా వదిలేసినట్టు తెలుస్తోంది. ఆ మూవీస్ ఎంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..‘అర్జున్’ మూవీ తర్వాత ఎంఎస్ రాజు నిర్మాత‌గా గుణ‌శేఖ‌ర్ డైరెక్షన్‌లో ‘సైన్యం’ మూవీ ప్రారంభం కాగా, ‘సైనికుడు’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఆ మూవీ ఆగిపోయింది.

అలాగే ‘వీడు చాలా హాట్ గురూ’ సినిమాను ‘ఒక్కడు’ అసిస్టెంట్ డైరెక్టర్ జాస్తి హేమంబ‌ర్ ద‌ర్శక‌త్వంలో రావాల్సి ఉన్నా ‘ఖ‌లేజా’ లేట్ అవ్వడంతో అది పట్టాలెక్కలేదు.ఇక బోయ‌పాటి ద‌ర్శక‌త్వంలో ఓ మాస్ మూవీ రావాల్సి ఉండగా అది కూడా ప‌ట్టాలెక్కలేదు. మ‌హేష్ , క‌రిష్మా క‌పూర్ జంట‌గా ‘మిస్టర్ ఫ‌ర్‌ఫెక్ట్’ చేయాల‌ని అనుకున్నా.. ‘దూకుడు’ మూవీకి ఓకే చెప్పడంతో కార్యరూపం దాల్చలేదు. ఇక మ‌హేష్ – మ‌ణిర‌త్నం కాంబోలో ఓ సినిమా చేయాలనుకున్నా కుదరలేదు.

ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘హ‌రేరామ – హ‌రేకృష్ణ’ సినిమా అనుకున్నారు కానీ పట్టాలెక్కలేదు. ప్రిన్స్‌కు రెండు భారీ హిట్లు అందించిన పూరితో ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ చేయాలనుకున్న ఆ టైంలో పూరి వరుస ప్లాఫులతో పీకల్లోతూ కష్టాల్లో ఉండటంతో మహేశ్ మరో సినిమా చేసేందుకు వెనకడుగేశారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది