Lata Mangeshkar : లతా మంగేష్కర్ తెలుగులో పాడింది మూడే పాటలు.. అవేంటో తెలుసా?
Lata Mangeshkar : తనకు మెలోడీ క్వీన్ అని పేరు. మెలోడీ పాటలు పాడాలంటే తన తర్వాతనే ఎవరైనా. పలు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు కొన్ని వేల పాటలు అందించి.. అవిశ్రాంతంగా సేవ చేసి.. ఇప్పుడు ఆమె తుదిశ్వాస విడిచారు. సినీ పరిశ్రమకు దూరం అయ్యారు. దీంతో భారత సినీ పరిశ్రమ మూగబోయింది. తనకు నివాళులు అర్పిస్తోంది.ఒక్క హిందీనే కాదు.. దాదాపు 20 భాషల్లో తను 50 వేలకు పైగా పాటలు పాడారు. తను చివరగా మూడేళ్ల క్రితం సౌగంద్ అనే పాట పాడారు. అది ఇండియన్ ఆర్మీ కోసం పాడిన పాట. అదే ఆమె పాడిన చివరి పాట.హిందీతో పాలు ఇతర భాషల్లో వందలు, వేల పాటలు పాడిన లతా మంగేష్కర్..
తెలుగులో మాత్రం కేవలం మూడే పాటలు పాడారు. తనది ఎంతో అద్భుతమైన గొంతు అయినప్పటికీ.. మెలోడీ పాటలు పాడటంతో తను దిట్ట అయినప్పటికీ.. ఎందుకు తను తెలుగులో ఎక్కువ పాటలు పాడలేకపోయారో మాత్రం అంతు చిక్కలేదు.తెలుగులో తను పాడిన తొలి పాట.. 1955లో విడుదలైన సంతానం అనే సినిమాలోనిది. ఆ సినిమాలో ఏఎన్నార్, సావిత్రి నటించారు. నిదురపోరా తమ్ముడా అనే పాటను తను పాడారు. అదే తను తెలుగులో పాడిన తొలి పాట.
Lata Mangeshkar : లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాటలు ఏవంటే?
ఆ తర్వాత 1965 లో వచ్చిన దొరికితే దొంగలు అనే సినిమాలో పాట పాడారు. ఆ సినిమాలో ఎన్టీఆర్, జమున నటించారు. అందులో శ్రీవెంకటేశా అనే పాటను లతా మంగేష్కర్ పాడారు. ఆ తర్వాత తెలుగులో తన చివరి పాట.. 1988లో పాడారు. ఆఖరి పోరాటం అనే సినిమాలో తెల్ల చీరకు అనే పాటను లతా పాడారు. ఆ సినిమాలో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించారు. తెల్లచీరకు అనే పాటను ఎస్పీ బాలుతో కలిసి ఆమె పాడారు.చివరగా.. 2009లో జైల్ అనే సినిమాతో తన కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టారు లతా. జైల్ అనే సినిమాలో డాటా సున్ లే అనే పాట పాడి ఆ తర్వాత ఆమె సినిమా పాటలు పాడలేదు. ఎక్కువగా భక్తి గీతాలను ఆలపించారు.