Lata Mangeshkar : లతా మంగేష్కర్‌పై విష ప్రయోగం జరిగిందా.. షాక్‌లో అభిమానులు..!
Lata Mangeshkar : గాన కోకిల లతా మంగేష్కర్ కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. తన మధుర గానంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న లతా ఇక లేరన్న వార్తను ఆమె అభిమాలనుతోపాటు సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న లతా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం ప్రతి ఒక్కరికి కోలుకోలేని షాకిచ్చింది. లతా జీ కనుమూసిందని తెలియగానే ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. కొన్ని దశాబ్దాల పాటు గాత్రంతో మెప్పించారు లతా జీ. ఆమె భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపనుంది మహారాష్ట్ర ప్రభుత్వం.లతా మృతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో గతంలో ఆమెపై విషప్రయోగం జరిగిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు. 1963లో లతా మంగేష్కర్‌పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. వాంతులు కూడా చేసుకుంది. కాళ్లు సైతం కదపడానికి వీల్లేక నొప్పితో విలవిల్లాడుతూ మూడురోజుల పాటు మంచానికే పరిమితమైంది. ఆమెను పరీక్షించిన డాక్టర్.. ఎవరో ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని లతాజీకి సన్నిహితంగా మెలిగే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్‌దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు.లతా నేపథ్య గాయనిగా 50వేలకుపైగా పాటలను ఆలపించారు. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గాను ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటూ కీర్తిస్తారు.
Lata Mangeshkar : లతాపై విష ప్రయోగం..
భారత రత్న సాధించిన ఈ మహా గాయనిని ఒక దశలో కొందరు వ్యక్తులు హత్య చేసేందుకు ప్రయత్నించారట. కాగా, లతా మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ జ్ఞాపకార్థంగా రెండు రోజుల పాటు జాతీయ సంతాపదినాలు కూడా ప్రకటించారు. గానకోకిలగా యావత్ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నట్లుగా ప్రకటించినా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్సకి రెస్పాండ్ కాలేక మృతి చెందారు.