Lata Mangeshkar : భారత గాన కోకిల లతా మంగేష్కర్ ఇకలేరు..
Lata Mangeshkar : భారత గాన కోకిలగా భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ రోజు (ఆదివారం’ ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న లతా..
ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా లెజెండరీ సింగర్ లతా మంగేషర్కర్ ఈ ఏడాది జనవరి 11న ఆస్పత్రిలో చేరింది. అలా ఆస్పత్రిలో చేరిన అనంతరం జనవరి నెలఖారున కరోనా నుంచి కోలుకుంది. కాగా, తర్వాత లతా మంగేష్కర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.
Lata Mangeshkar : మూగ బోయిన మధుర గానం..
దాంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై లతా మంగేష్కర్ కు వైద్యులు చికిత్సను అందించారు. కాగా, తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఇక లేరనే విషయం తెలుసుకుని ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.