Rao Gopal Rao : చివరి రోజుల్లో రావు గోపాల రావు ఎందుకు కష్టాలు పడ్డాడు? ఆయన అంత్యక్రియలకు ఎందుకు ఎవరూ రాలేదు?
Rao Gopal Rao : రావు గోపాల రావు.. ఈయన పేరు చెప్పగానే మనం ఓ 20 నుంచి 30 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అవును.. అప్పట్లో వచ్చిన ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే.. అందులో విలన్ గా రావు గోపాల రావు ఉండాల్సిందే. విలనిజం ఆయన్ను చూసే పుట్టిందా అన్నట్టుగా ఉండేది ఆయన చేసే పాత్ర. అందుకే ఆయనకు విలక్షణ నటుడు అని పేరు. ఒక విలన్ గానే కాకుండా.. ఒక తండ్రిగా.. ఒక తాతగా, మామగా.. ఒక కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు రావు గోపాల రావు.సినిమాల మీద మక్కువతో నాటకాల నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేశాడు రావు గోపాల రావు. ఆయన కొడుకు రావు రమేశ్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా స్థిరపడ్డాడు.
సినిమా రంగంలో రావు గోపాల రావు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందు తనకు చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత తనంటే నిరూపించుకోవడంతో రావు గోపాల రావుకు ఆఫర్లు క్యూ కట్టాయి. రావు గోపాల రావు సొంతూరు కాకినాడ. నాటకాలు వేస్తూ చెన్నైకి వెళ్లి అక్కడే అవకాశాలు అందిపుచ్చుకొని గొప్ప నటుడిగా ఎదిగాడు రావు గోపాల రావు. తన కెరీర్ లో ఎంతో సక్సెస్ సాధించిన రావు గోపాల రావు.. తన చివరి రోజుల్లో మాత్రం చాలా కష్టాలు పడ్డాడట. తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడట. దానికి కారణం.. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వడమేనట. సినిమా రంగంలో రావు గోపాల రావు చాలా డబ్బు సంపాదించినప్పటికీ..
Rao Gopal Rao : రావు గోపాల రావుకు ఆర్థిక కష్టాలు ఎందుకు వచ్చాయి?
అందరినీ నమ్మి వాళ్లకు అర్థిక సాయం చేసి.. చివరకు తనకు అనారోగ్యం వస్తే.. ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేకుండా ఇబ్బందులు పడ్డాడట రావు గోపాల రావు. రావు గోపాల రావు.. 1994 లో కన్ను మూశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. అయితే.. రావు గోపాల రావు మరణ వార్త తెలిసినా కూడా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవ్వరూ ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదట. ఆయనకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులతో పరిచయం ఉన్నప్పటికీ.. చాలా మంది ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు. కేవలం అల్లు రామలింగయ్య, పీఎల్ నారాయణ, రేలంగి, నిర్మాత కృష్ణ, ఇంకా కొందరు తమిళ నటులు మాత్రమే హాజరు అయ్యారట. అంత గొప్ప నటుడు.. ఇలా సాధారణంగా ఎవరూ రాకుండా అంత్యక్రియలు జరగడం ఏంటని అప్పట్లో చాలారోజులు చర్చించుకున్నారట.