Ramya Krishnan : రమ్యకృష్ణ కొడుకు ఎవరో తెలుసా.. చూస్తే ఆశ్చర్యపోతారు..
Ramya Krishnan : సీనియర్ నటి రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు వంటి హీరోలతో హీరోయిన్ గా చేసింది. అలాగే అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు, కృష్ణ, శోబన్ బాబు వంటి హీరోలతో సరసన కూడా నటించింది. వెల్లై మనసు అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200కు సినిమాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక 2003లో డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది.ఇక నరసింహ సినిమాలో రజనీకాంత్ సరసన నటించి తన విలనిజాన్నిమరో కోణంలో చూపెట్టి ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తోంది. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలిలో శివగామి పాత్రలో రాజమాతగా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. రమ్యకృష్ణ ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాతో పాటు రమ్యకృష్ణ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.
do you know who is ramya krishna son
ఇప్పటికే జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్విన్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి మెప్పించింది. వీటితో పాటు రమ్యకృష్ణ పలు షోలకు వ్యాఖ్యాతగాను, కొన్ని సిరీయల్స్‌లో కూడా నటిస్తున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కాగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రమ్మకృష్ణ రోజుకు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. కాగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ దంపతులకు రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నాడు. కాగా రిత్విక్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. దీంతో రమ్యకృష్ణకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు.