Ramya Krishnan : మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసిన నటి రమ్యకృష్ణ ..!
ప్రధానాంశాలు:
మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసిన నటి రమ్యకృష్ణ
రమ్యకృష్ణ సోషల్ మీడియాలో బాగా వైరల్
Ramya Krishnan : ఇటీవల రమ్యకృష్ణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. సినిమాలపరంగా వైరల్ అయితే పట్టించుకునేవారు కాదు కానీ ఆమె వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. టిడిపి మాజీ మంత్రి బండారి సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నటి రమ్యకృష్ణ ఖండించారు. బండారి సత్యనారాయణ చేసిన కామెంట్స్ కి రమ్యకృష్ణ గట్టి కౌంటర్ ఇచ్చారు. సమాజంలో మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి అని హితవు పలికారు. రోజా కి మద్దతుగా నిలవడంతో టిడిపి పార్టీ క్యారిడర్ రమ్యకృష్ణను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. రమ్యకృష్ణ టార్గెట్ చేసి ఆమెపై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించినవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతంలో చెన్నైలో మద్యం బ్యాంక్ ఉన్న సమయంలో రమ్యకృష్ణ కారులో భారీ ఎత్తున మందు సీసాలు దొరికాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా సృష్టించింది. ఆ పాత వీడియోను టిడిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈ ఘటన మరువక ముందే మరో వివాదంలో రమ్యకృష్ణ చిక్కుకుంది. ఇటీవల రమ్యకృష్ణ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో రమ్యకృష్ణ క్లోజ్ ఫ్రెండ్స్ హాజరు అయ్యారు.
నటి రాధిక శరత్ కుమార్ రమ్యకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఫోటోను షేర్ చేశారు. అయితే ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ను ఈసారి క్లారిటీగా పరిశీలిస్తే అది పబ్ అని స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా రమ్యకృష్ణ చేతిలో మందు గ్లాసు ఉన్నట్లు ఈ ఫోటో చూసిన వారికి ఇట్లే తెలిసిపోతుంది. బర్త్డే సెలబ్రేషన్స్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేసినట్లుగానే కనిపిస్తున్నారు. రమ్యకృష్ణను గట్టిగా హత్తుకున్నా రాధిక ముద్దులు ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.