Bimbisara Child Artist : కరోనా కష్టకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా నుంచి ఎట్టకేలకు కోలుకున్న చిత్ర పరిశ్రమకు శుభవార్త ఏదైనా ఉంది అంటే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మన సినిమాలు చాలా మేరకు విజయవంతం కావడమే. బహుబలి-2 తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా హిట్లు రాలేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఉండగా.. తాజాగా బింబిసార సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారింది. మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘అఖండ’, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’, తాజాగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’..
ఈ మూడు నందమూరి హీరోల మూవీలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.ఇందులో కామన్ పాయింట్ ఎమిటంటే..ఈ మూడు కథలు ఒక పాప చుట్టూ తిరిగే మూవీస్ కావడమే. ఆర్ఆర్ఆర్‌లో మల్లి అనే పాప కోసం ఎన్టీఆర్ స్టోరీ నడుస్తుంది. ఇక లేటెస్టుగా వచ్చిన ‘బింబిసార’ కూడా పాప చుట్టూ కథ అంత నడుస్తుంటుంది.తనను రక్షించిన పాప కోసం బింబిసారుడు ఎలా మారిపోయాడనేదే స్టోరీ.. ఇక ‘బింబిసార’ లో సినిమాలో నటించిన పాప పేరు శ్రీదేవి. ఈ పాపకి ఇది తొలి మూవీ కాదు. దీనికి ముందు ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘మేజర్’ వంటి మూవీస్ లో కూడా ఈ చిన్నారి నటించి మంచి పేరును సంపాదించుకుంది.
అలాగే ప్రేమ, యమలీల, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ లో కూడా నటించి మంచి మెప్పు పొందింది.ఇక శ్రీదేవి తన తండ్రి ద్వారా మూవీస్ లోకి అడుగు పెట్టింది. శ్రీదేవి తండ్రి పేరు శ్రీహరి గౌడ్. ఇతను ఆర్టిస్టు మాత్రమే కాదు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన వ్యక్తి.షూటింగ్స్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇక ‘బింబిసార’ సినిమాకి గాను శ్రీదేవికి మంచి గుర్తింపు వచ్చింది.క్యూట్ లుక్స్‌తో ఉన్న ఈ పాప యాక్టింగ్ కూడా తన వయస్సుకు మించి చేసిందని అభిమానులు చెబుతున్నారు.శ్రీదేవి హావభావాలు, డైలాగులు సినిమాకు మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.