Sr NTR : దేవదాసు, పార్వతీలకు సంబంధించి మొత్తం 18 భాషలలో సినిమాలు వచ్చాయి. అందులో రెండు మన తెలుగులోనివే. అయితే అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన సినిమా దేవదాస్. సావిత్రి సుదీర్ఘ సినీ చరిత్రలోనే ఈ సినిమా సాధించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేమికుడిగానే కాకుండా అహంకారిగా, తాగుబోతుగా దేవదాసు పాత్రలో నాగేశ్వరరావు లీనమైన ఈ సినిమా తెలుగులో లో 365 దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక రికార్డులను సొంతం చేసుకుంది. అయితే కృష్ణ దేవదాస్ అంతగా ఆగకపోగా, ఈ సినిమా విషయంలో కృష్ణ, నాగేశ్వరరావు మధ్య అనేక గొడవలు జరిగాయంట. సినీ ఇండస్ట్రీ ఎపుడు ఒక్కటిగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య కూడా మనస్పర్ధలు ఉండేవి. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు.అప్పట్లో ఎన్టీఆర్,ఏఎన్నార్ ఏదో ఇష్యూ వచ్చి జమునతో నటించకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో నాగిరెడ్డి, చక్రపాణి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, జమునల మధ్య రాజీ కుదిర్చి ‘గుండమ్మకథ’ లో జమునను హీరోయిన్‌గా తీసుకున్నారు.
ఇక దేవదాసు సినిఆ విషయానికి వస్తే.. దేవదాసు సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, నిర్మాత డి.ఎల్ నారాయణ ఈ సినిమాను తెలుగు తమిళంలో ఒకేసారి తీశారు. అయితే వేదాంతం రాఘవయ్య కు యువ ఎన్టీఆర్ ఆర్ అంటే అత్యంత ఇష్టం. ఏ వేషం వేసినా ఇట్టే ఇమిడి పోతాడు అనే పేరు కూడా అన్నగారికి ఉంది. దీంతో తో తొలుత దేవదాసు సినిమా గురించి చర్చించి నప్పుడు ఎన్టీఆర్ ను అనుకున్నారట. కథలో చేసిన మార్పులు తర్వాత కాలంలో ఎన్టీఆర్ కు నచ్చలేదంట. కేవలం హీరోను తాగుబోతుగా చూపించడాన్ని సహించలేక, సినిమా నుంచి విరమించుకున్నారు. ఇక భానుమతి ఫుల్ బిజీగా ఉండడంతో కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. చివరకు ఆ కథ ఏఎన్ఆర్ వద్దకు వెళ్లడం, ఆయన సినిమాను చేయడం, చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే హిట్ కొట్టడం జరిగిపోయాయి. అప్పుడు చాలా మంది నిర్మాతలు డి.ఎల్ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య కు అక్కినేని ఆ పాత్రకు పనికిరాడు, అతన్ని తీసేయండి అని సలహా ఇచ్చారట.
కానీ వారిని లెక్కచేయకుండా అక్కినేనితో నే ఆ సినిమాను నిర్మించారు. ఆ చిత్రం గొప్ప సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో లో జగమే మాయ పాట చిత్రీకరణలో నిజంగానే అక్కినేని గారు తాగి చేశారని చెప్పుకునేవారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇది గొప్ప ప్రచారంలో కూడా ఉండేది. అయితే ఆ పాట చిత్రీకరణ రాత్రి సమయంలో జరిగిందని అక్కినేని కడుపునిండా భోజనం చేసి షూటింగ్ లో పాల్గొనే వాడట. నిద్రకు కళ్ళు మూసి మూతలు పడుతుండేవట. అలాంటి సమయంలో తీసిన పాట అని చిత్ర సభ్యులు చెప్పుకునేవారు. కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన దేవదాసు కూడా సరిగ్గా అదే సమయంలో రిలీజ్ అయింది. కాగా ఆ రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవ్వగా.. పాత దేవదాస్ ఒక్కసారి అద్భుతంగా హిట్ కాగా, కృష్ణ గారి దేవదాస్ ఫెయిల్ అయిందట. అయితే కృష్ణ సినిమా దేవదాస్ మాత్రం నవయుగ సంస్థ ద్వారా రిలీజ్ అయింది.నాగేశ్వరరావు తన సొంత సంస్థ ద్వారా పాత దేవదాసు ను రిలీజ్ చేయడంతో, నవయుగ ఫిలిమ్స్ కు చెందిన హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ఇకపై నాగేశ్వరరావు గారు సినిమాలు చిత్రించడానికి వీలులేదని నిర్ణయించారట.
దాంతో అప్పటి నుంచి నాగేశ్వరరావు గారి సినిమాలు హైదరాబాద్ లో తీయడానికి వీలు లేకుండా పోయిందని, అందువల్ల అప్పట్లో బెంగుళూరు మరియు ఊటీ లలో ఆయన సినిమాలు చిత్రీకరించేవారు అని చెప్పుకొచ్చారు. అటువంటి పరిస్థితులు ఇకపై ఉండకూడని, హైదరాబాదులో కూడా తన స్టూడియో ఉండాలని గట్టి పట్టుదలతో నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరు మీద స్టూడియోకి శంకుస్థాపన చేసి కొద్ది నెలల్లోనే దాని నిర్మాణం పూర్తి చేసి, అక్కడి నుండి తన సినిమాలను ఇందులోనే చిత్రీకరించడం మొదలుపెట్టారట. మొత్తానికి కృష్ణ గారి దేవదాసు సినిమా ఇన్ డైరెక్ట్ గా, నాగేశ్వరరావుగారి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి కారణమైంది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.