Srimukhi : శ్రీముఖి శేఖర్ మాస్టర్‌కి ఎందుకు ముద్దు పెట్టిందో ఓపెన్‌గా చెప్పేసింది

Authored By vamana sai | The Telugu News | Updated on : 16 August 2021, 7:21 am

Srimukhi : బుల్లితెర మీద బాగా ఆకట్టుకుంటున్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. నాన్ స్టాప్‌గా ఎంతసేపైనా మాట్లాడగలిగే స్టామినా ఉన్న ఈ యాంకర్‌కి యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ బ్యూటీకి సినిమాలు అవకాశాలు వస్తూ అప్పుడప్పుడు సినిమాలు చేస్తుండటంతో అటు సినిమాల పరంగా మంచి పాపులారిటీ ఉంది. షో ఏదైనా తనదైన స్టైల్లో అదరగొట్టే శ్రీముఖి కొన్ని సందర్భాలలో సాంగ్స్‌కి డాన్స్ చేస్తూ తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటుంది కూడా. ఇంత ఫాలోయింగ్ ఉన్న ఎవరికైనా కొన్ని సార్లు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుండటం సహజం.

do you know why srimukhi kissed shaker master

do you know why srimukhi kissed shaker master

ఇలాంటి అప్పుడపుడు శ్రీముఖికి వస్తుంటాయి. తాజాగా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ శ్రీముఖి – శేఖర్ మాస్టర్ మీద వచ్చాయి. అలా రావడానికి కారణం శ్రీముఖి, మన డాన్స్ మాస్టర్ శేఖర్‌కి ముద్దు పెట్టడమే. అలా ముద్దు పెట్టినందుకు కొందరు బాగానే కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు. ఎంత షో అయితే మాత్రం ఇలా పెళ్ళైన వ్యక్తికి ఇలా ముద్దు పెట్టేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వీటికి తాజాగా శ్రీముఖి శేఖర్ మాస్టర్‌కి తానెందుకు ముద్దు పెట్టిందో చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ షోలో శ్రీముఖి – శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు.

Srimukhi : ఓంకార్ శేఖర్ మాస్టర్‌కి ముద్దు పెట్టమని సైగ చేశాడు.

ఆ సమయంలో ఇద్దరు కలిసి ఓ సాంగ్‌కి డాన్స్ చేశారు. ఆ సాంగ్ ముద్దుకు సంబంధించిన సాంగ్ కావడంతో ఓంకార్ శేఖర్ మాస్టర్‌కి ముద్దు పెట్టమని సైగ చేశాడు. అందుకే పెట్టాను తప్ప, కావాలని పెట్టలేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇది సాంగ్ పర్ఫార్మెన్స్‌లో భాగంగా జరిగింది తప్ప, కావాలని అలా శేఖర్ మాస్టర్‌కి నేను ముద్దు పెట్టలేదనింది. కాగా ప్రస్తుతం ఈమె క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. ఇ. సత్తి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp