Jamba Lakidi Pamba : అప్పట్లో 50 లక్షలతో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు?
Jamba Lakidi Pamba : జంబలకిడి పంబ అనే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు.. ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీయాలంటే ఈవీవీ తర్వాతనే ఎవరైనా. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజే వేరు. జంద్యాల తర్వాత అలాంటి వినోదాన్ని పంచే సినిమాలను ఈవీవీ మాత్రమే తీయగలిగేవారు.ఆయన తీసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా జంబలకిడి పంబ. ఆ సినిమా 1992 లో రిలీజ్ అయింది.
తెలుగు సినిమా చరిత్రనే జంబలకిడి పంబ బద్దలు కొట్టింది అంటే ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అర్థం అవుతుంది. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.అప్పట్లోనే ఈ సినిమాకు 50 లక్షలు ఖర్చు పెట్టారు. 1992 లో 50 లక్షలు అంటే నేడు 50 కోట్లతో సమానం. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అది.50 లక్షలతో ఆ సినిమా తెరకెక్కితే.. రూ.2 కోట్లను జంబలకిడి పంబ వసూలు చేసింది. ఈ సినిమాకు రాజేంద్రప్రసాద్ ను హీరోగా అనుకున్నాడట ఈవీవీ.
Jamba Lakidi Pamba : ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
అప్పట్లో రాజేంద్రప్రసాద్.. బిజీ ఆర్టిస్ట్. ఆయన డేట్స్ ఖాళీగా లేకపోవడంతో నరేశ్ తో ఆ సినిమాను తీశాడు ఈవీవీ.ఆమనిని హీరోయిన్ గా తీసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో టాప్ కమెడియన్లుగా ఉన్నవాళ్లందరినీ ఆ సినిమాలో పెట్టుకున్నాడు ఈవీవీ. వంద రోజుల పాటు ఈ సినిమా సూపర్ గా థియేటర్లలో ఆడింది. ఇప్పటికీ.. ఆ సినిమాను సినీ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరం పిల్లలు కూడా ఆ సినిమాను చూసి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు.