
Doctor Babu comments on Big Boss Winner vj sunny
Vj Sunny : బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ వీజే సన్నీపై కార్తీకదీపం సీరియల్ లీడ్ రోల్ చేస్తున్న కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ షో అంటే తనకు ఇష్టమని, ఎంత బిజీగా ఉన్నా రెగ్యూలర్‌గా షో ఫాలో అయ్యేవాడినని చెప్పారు. తన ఫ్రెండ్స్ చాలా మంది సీజన్-5లో కంటెస్టెంట్లుగా చేశారని చెప్పుకొచ్చారు. వారిలో సన్నీ, మానస్, సిరి, విశ్వ, ఉమాదేవి, రవి తదితరులు ఉన్నారు. రీల్ లైఫ్‌లో డాక్టర్ బాబుగా పేరు తెచ్చుకున్న మనోడి అసలు పేరు నిరుపమ్ పరిటాల.. కానీ, కార్తీకదీపం సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బాబుగా అందరి మనస్సులో నిలిచిపోయారు.
తాజాగా బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీపై డాక్టర్ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బిగ్‌బాస్ సీజన్ 5 షో ప్రారంభం నుంచి ఫాలో అవుతున్నానని, మొదట్లో విశ్వ విన్నర్ అవుతాడని అనుకున్నట్టు చెప్పిన డాక్టర్ బాబు ముందుకు వెళ్లే కొద్దీ లెక్కలు మారిపోయాయన్నారు మానస్ బ్యాలెన్స్డ్‌గా ఆడాడని, ఒక స్టేజ్‌లో రవి, షణ్ముఖ్‌లు టాప్ లోకి వచ్చేసారని గుర్తుచేశారు. అయితే, సన్నీ విన్నర్ అవుతాడని తాను అస్సలు ఊహించలేదని నిరుపమ్ పరిటాల చెప్పారు. సన్నీ షో ప్రారంభంలో అరుపులు, కేకలతో చాలా అగ్రెసివ్‌గా ఉన్నాడని, అతని రియల్ క్యారెక్టర్ అది కాదన్నాడు.
Doctor Babu comments on Big Boss Winner vj sunny
సెకండాఫ్‌లో మాత్రం తనలోని హాస్యాన్ని బయటకు తీశాడన్నారు. సన్నీ బయట చాలా జోవియల్‌గా ఉంటాడని గుర్తుచేశారు. బయట మేం కలిసినప్పుడు తనతో చాలా బాగుంటాడని, కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకింత అగ్రెసివ్‌గా ఉన్నాడని అనుకున్నట్టు వివరించాడు. అతనిలోని జోవియల్ యాంగిల్ ఎటుపోయిందని అనుకున్నట్టు తెలిపారు. సన్నీ విన్నర్ అవడం చాలా సంతోషంగా ఉందన్నాడు.తనకు అవకాశం వస్తే వెళ్లేందుకు ఆలోచిస్తానని వెల్లడించారు.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.