Samantha : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం టాప్ గ్రాసర్ ఆఫ్ 2021గా నిలిచి బాలీవుడ్ సినిమాలకే సవాలు విసిరింది. సినిమాలో బన్నీ నటన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ డైరెక్షన్, సమంత ఐటెం సాంగ్ మూవీని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. అయితే సమంత తొలి సారి ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. పాటలో సమంత తన గ్లామర్ ఒలకబోస్తూ ‘ఊ అంటావా మావ .. ’ అంటూ అల్లు అర్జున్‌తో కలిసి రచ్చ చేసింది.
ఇటు ఫ్యాన్స్.. అటు మాస్ ఆడియెన్స్ ఊగిపోయారు.‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో ఆకట్టు కునేలా పాడింది. ‘బొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు.. సన్న సన్నంగుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు.. బొద్దు కాదు సన్న కాదు.. ఒంపుసొంపు కాదండీ.. ఒంటిగ చిక్కామంటే చాలు.. మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ కొంత సెటైరికల్‌గా లిరిక్స్ రాశారు చంద్రబోస్. ఈ సాంగ్‌పై ఎన్ని వివాదాలు అలుముకున్నా కూడా సాంగ్ మాత్రం యూట్యూబ్ లో రచ్చ చేసింది.
రీసెంట్‌గా ఈ సాంగ్ కోసం సమంత ఎంతగా కష్ట పడింది అనే దానికి సంబంధించిన రిహార్సల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ పాటలో సమంత చాలానే కష్టపడింది. కొరియోగ్రాఫర్ చుక్కలు చూపించాడంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా సినిమాలో బన్నీతో డ్యాన్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో సమంత బన్నీపైకి ఎక్కి రచ్చరచ్చ చేసింది. వీరిద్దరి పర్‌ఫార్మెన్స్‌కి ప్రశంసల వర్షం కురుస్తుంది. కాగా, ఈ పాట కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 120 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.