Janaki Kalaganaledu : కోచింగ్ కు రాజమండ్రి వెళ్లి వస్తుండగా జానకికి అనుకోని ప్రమాదం… రామా షాక్.. జ్ఞానాంబకు ఈ విషయం తెలుస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on: February 26, 2022, 11:34 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 28 ఫిబ్రవరి 2022, ఎపిసోడ్ 246 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి ఎలాగోలా.. దిలీప్ తల్లిని వాళ్ల ప్రేమ విషయం జ్ఞానాంబకు చెప్పకుండా ఒప్పిస్తుంది. దీంతో రామా, దిలీప్ ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత వెన్నెల, దిలీప్ పెళ్లికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. మా ఆయన ఊరెళ్లారు. ఆయన రాగానే.. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో కబురు చేస్తాం అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో మగ పెళ్లి వాళ్లు కూడా సరే అంటారు. జ్ఞానాంబ వాళ్లు బయలుదేరుతారు. ఇంతలో దిలీప్.. వెన్నెలకు ఫోన్ చేసి.. మీ వదిన సూపర్.. మీ వదిన వల్లే మన పెళ్లికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి అని వెన్నెలకు చెబుతాడు దిలీప్.

does jnanamba know about janaki ips coaching in rajahmundry

does jnanamba know about janaki ips coaching in rajahmundry

అప్పుడే తన ఫోన్ మరిచిపోయిన మల్లిక తిరిగి ఇంట్లోకి వస్తుంది. దిలీప్ మాట్లాడే మాటలను వింటుంది. తనకు ఉన్న అనుమానం ఇంకాస్త పెరుగుతుంది. తర్వాత అందరూ ఇంటికి వస్తారు. వెంటనే ముహూర్తాలు పెట్టిద్దాం అని రామాతో చెబుతుంది జ్ఞానాంబ. అయితే.. ఈ మల్లిక ఈ సంబంధాన్న పెటాకులు చేస్తుంది.. మా తమ్ముడికే వెన్నెలను ఇచ్చి పెళ్లి చేస్తా అని మనసులో అనుకుంటుంది మల్లిక. వెన్నెలను పిలిచి.. సంబంధం ఖాయం అయిన విషయాన్ని చెబుతుంది. మీ జానకి వదిన మంచి సంబంధం చూసింది అని చెబుతుంది జ్ఞానాంబ. కాకపోతే ఎంతైనా ఆడపిల్ల వాళ్లం కదా.. అక్కడికి వెళ్లి చూసి వచ్చాక నా భయాలన్నీ పోయాయి అంటుంది జ్ఞానాంబ.

దీంతో మల్లిక ముందే… థ్యాంక్స్ వదిన అంటూ జానకిని పట్టుకొని తెగ సంతోషిస్తుంది. దీంతో మల్లికకు ఏదో డౌట్ వస్తుంది. ఏదో జరుగుతుంది.. అని అనుకుంటుంది. కుచ్ కుచ్ హోతా హై.. కాదు కాదు.. కుచ్ కుచ్ హై.. ఓ కుచ్ కుచ్ క్యాహై అని అనుకుంటుంది మల్లిక.

Janaki Kalaganaledu : వెన్నెల తెగ సంతోషంగా ఉండటం చూసి మల్లికకు అనుమానం

వెన్నెల సంతోషంగా ఉండటం చూసి అసలు మల్లికకు ఏం అర్థం కాదు. మరోవైపు ఈ పెళ్లిని ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా జరిపించాలని అనుకుంటుంది జానకి. వెన్నెల, దిలీప్ పెళ్లిని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపిస్తున్నందుకు రామా.. తనకు ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు.

చేతుల్లో ఒక లెటర్ ఉంటుంది. అదేంటి అని అడుగుతుంది జానకి. దీంతో మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పనుల్లో బిజీగా ఉంటున్నారు కాబట్టి.. ఖార్ఖానాలో కేకుల తయారీలో కూడా బిజీ అయిపోతున్నారు కాబట్టి.. రాత్రి పూట మీకు ఐపీఎస్ కోచింగ్ ఇచ్చేలా పర్మిషన్ తీసుకున్నా అని చెబుతాడు.

దీంతో జానకి ఉబ్బితబ్బిబ్బవుతుంది. రామాకు థాంక్స్ చెబుతుంది. కాకపోతే అత్తయ్యకు ఏం చెప్పి రాజమండ్రికి కోచింగ్ కు వెళ్లాలి అని అడుగుతుంది జానకి. దీంతో దానికి నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాలే అంటాడు రామా. మరోవైపు జ్ఞానాంబ కేకుల ఆర్డర్ తీసుకుంటుంది.

జానకిని పిలిచి కేకుల ఆర్డర్ గురించి చెబుతుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. మరోవైపు రాజమండ్రికి వెళ్లి కోచింగ్ అయిపోయాక ఆటోలో తిరిగి వస్తుంటుంది జానకి. రాత్రి పూట కావడంతో ఎవ్వరూ లేరని గ్రహించి.. ఆటో డ్రైవర్ ఆటో ఆపి.. జానకిని దిగమంటాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులను, నగలను ఇచ్చేయాలని బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp