Mouna Ragam Siva Kumar : దాని కోసమే నేను అమ్మాయిలా మారిపోయా.. షాకిచ్చిన బిగ్ బాస్ ప్రియాంకా జైన్ భర్త శివ కుమార్
Mouna Ragam Siva Kumar : బిగ్ బాస్ 7 ఇటీవల ప్రారంభం అయింది. బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది సీరియల్ నటులే. ఎక్కువ మంది సీరియల్ నటులను తీసుకున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అయి మూడు రోజులు కాలేదు అప్పుడే హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక.. బిగ్ బాస్ లోకి వెళ్లిన సీరియల్ నటులంతా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. మరికొందరు ఇంకో గ్రూప్. ఇలా గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి బిగ్ బాస్ హౌస్ లో. బిగ్ బాస్ సీజన్ 7 తొలి కంటెస్టెంట్ గా మౌన రాగం, జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ హౌస్ లోకి వెళ్లారు.
మౌనరాగం సీరియల్ హీరో శివ కుమార్ తో కలిసి నటించిన ప్రియాంక అతడినే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. ఇద్దరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. అయితే.. ప్రియాంకకు తెలుగు బుల్లితెర మీద అనుకున్నంతగా క్రేజ్ రాలేదు. పాపులారిటీ రాలేదు. అందుకే తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. అయితే.. తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే తను రికార్డు చేసిన ఓ వీడియో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత పోస్ట్ చేశారు.ప్రియాంక జైన్ కు సంబంధించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతకంటే ముందు తన భర్త శివకుమార్ తనను ప్రాంక్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య ప్రియాంక కోసమే గడ్డం తీసేసి అమ్మాయి గెటప్ వేశాడట. ఆమెకు తెలియకుండా ఒక మేకప్ ఆర్టిస్ట్ ను పిలిచి అమ్మాయి గెటప్ వేసి జానకి కలగనలేదు నటుడితో కలిసి ప్రియాంక ఇంటికి వెళ్లాడు.
Mouna Ragam Siva Kumar : తన భార్య ప్రియాంకను ప్రాంక్ చేసిన శివకుమార్
తనను తాను ఇందుమతిగా పరిచయం చేసుకున్నాడు. అయితే.. ఆమెను చూసి ప్రియాంకకు ఏదో తేడా కొట్టింది. వాయిస్ కూడా ఏదో తేడా కొట్టిందని.. గొంతు మార్చి మాట్లాడటం, చేతికి ఉన్న ఉంగరాలు చూసి ప్రియాంక శివ కుమార్ ను గుర్తు పట్టేసింది. తనను ప్రాంక్ చేద్దామని పోయి శివకుమార్ అడ్డంగా ప్రియాంక ముందు దొరికిపోయాడు.