Koratala Siva – Acharya : ఆచార్య ప్రభావంతో కొరటాలపై కొత్త సందేహాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Koratala Siva – Acharya : ఆచార్య ప్రభావంతో కొరటాలపై కొత్త సందేహాలు..!

Koratala Siva – Acharya : మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఈ సినిమాలన్నీ దర్శకుడిగా పూర్తిగా కొరటాల శివ మార్క్‌ను చాలా క్లియర్‌ గా చూపిస్తాయి. కానీ, తాజాగా వచ్చిన ఆచార్యలో ఆ ఛాయలు అసలు వెతుక్కున్నా కనిపించడం లేదు. మెగా అభిమానులు ఎంతో ఆతృతగా నాలుగేళ్ళ నుంచి ఎదురుచూస్తే నిమిషాలలో అదంతా ఆవిరైపోయింది. కథ ఫైనల్ చేయడంలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అని అందరూ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. కానీ, చిరు కూడా […]

 Authored By govind | The Telugu News | Updated on :30 April 2022,11:00 am

Koratala Siva – Acharya : మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఈ సినిమాలన్నీ దర్శకుడిగా పూర్తిగా కొరటాల శివ మార్క్‌ను చాలా క్లియర్‌ గా చూపిస్తాయి. కానీ, తాజాగా వచ్చిన ఆచార్యలో ఆ ఛాయలు అసలు వెతుక్కున్నా కనిపించడం లేదు. మెగా అభిమానులు ఎంతో ఆతృతగా నాలుగేళ్ళ నుంచి ఎదురుచూస్తే నిమిషాలలో అదంతా ఆవిరైపోయింది. కథ ఫైనల్ చేయడంలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అని అందరూ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. కానీ, చిరు కూడా ఇలాంటి 80, 90ల నాటి పేలవమైన కథతో ఆచార్య సినిమా చేస్తారని అనుకోలేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి మెగాస్టార్ నుంచి వస్తుందనీ అది కూడా మెగా మల్టీస్టారర్‌గా వచ్చి ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందనీ ఎవరూ ఊహించలేదు.

కొరటాల శివ మార్క్ సినిమా అంటే నమ్మే జనాలు లేకపోవడం ఇక్కడ ఆసక్తి కరమైన విషయం. కథాంశమే సరిగ్గా లేకపోవడం ఆచార్య సినిమాకు పెద్ద మైనస్ అయింది. కొరటాల గత చిత్రాలు నాలుగు నాలుగు డిఫరెంట్ జోనర్‌లో వచ్చాయి. ఇప్పుడు ఆచార్య కూడా వాటికి భిన్నంగా వచ్చిన సినిమానే. కానీ, అది పాత కథ. ఇప్పటికే ఈ తరహా ట్రీట్‌మెంట్‌తో సౌత్ భాషలలో చాలా సినిమాలొచ్చాయి. ఆచార్య సినిమా ఫ్లాప్‌కు కారణం, పూర్తి బాధ్యత దర్శకుడు కొరటాల శివదే అని అంటున్నారు. వాస్తవంగా చూస్తే అంతే. ఇద్దరు మెగా హీరోలు దొరికితే ఎలాంటి మల్టీస్టారర్ రావాలి. కానీ, ఇది చూస్తే థియేటర్స్ సినిమాకు ఎక్కువ, ఓటీటీకి తక్కువగా అనిపిస్తుంది.

doubts raised on koratala siva after release of acharya

doubts raised on koratala-siva- after release of acharya

Koratala Siva – Acharya : ఎన్.టి.ఆర్ 30 కొరటాల శివ కెరీర్‌ను ఎలా డిసైడ్ చేస్తుందో.

ఇప్పుడు ఈ సినిమా ప్రభావం కొరటాల మీద గట్టిగా పడింది. తర్వాత చేస్తున్న ఎన్.టి.ఆర్ 30 మీద నందమూరి అభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యా యట. తారక్‌కు అభిమానులు కొరటాల చెప్పిన కథ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించమని సలహాలిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇక చరణ్‌తో ఇప్పటికే ఓ సినిమా చేస్తానని కొరటాల అన్నాడు. అలాగే, అల్లు అర్జున్‌తో, పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధంగా ఉందని చెప్పాడు. అవన్నీ పునారాలోచిస్తున్నారు. ఎన్.టి.ఆర్ 30 తప్ప ..పవన్, చరణ్, అల్లు అర్జున్ సినిమాలు ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవంటున్నారు. చూడాలి మరి ఎన్.టి.ఆర్ 30 కొరటాల శివ కెరీర్‌ను ఎలా డిసైడ్ చేస్తుందో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది