Chiranjeevi : ఆ ఇద్దరు హీరోలను గందరగోళంకు గురి చేసిన మెగాస్టార్
Chiranjeevi : చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ను అక్టోబర్ 5వ తారీకున దసరా సందర్భంగా విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. సినిమా యొక్క టీజర్ ను కూడా విడుదల చేయడం తో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా ను తెరకెక్కించాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. లూసీఫర్ సూపర్ హిట్ అయిన నేపథ్యం లో గాడ్ ఫాదర్ పై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందేమో చూడాలి.
ఇక గాడ్ ఫాదర్ విడుదల తేదీ వచ్చిన తర్వాత నాగార్జున సినిమా ది ఘోస్ట్ మేకర్స్ జుట్టు పీక్కుంటున్నారు. అక్టోబర్ 5వ తారీకున ది ఘోస్ట్ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాని ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ను విడుదల చేయడం కోసం చిరంజీవి యూనిట్ సభ్యులు అధికారికంగా డేట్ ను ఇవ్వడం వల్ల ది ఘోస్ట్ సినిమా విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల ఆలస్యంగా లేదంటే వారం రోజుల ఆలస్యంగా విడుదల చేయడం మంచిది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం నాగార్జున మాత్రమే కాకుండా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ సినిమా అయిన హరి హర వీరమల్లు సినిమా యొక్క విడుదల తేదీ లో కూడా మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో హరి హర వీరమల్లు సినిమా ను విడుదల చేయాలని భావించారు. కాని భోళా శంకర్ సినిమా అదే తేదీన రాబోతున్న నేపథ్యంలో పవన్ సినిమా విడుదల తేదీ విషయంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చిరంజీవి సినిమా ల వల్ల ఆ ఇద్దరు హీరోలు తమ సినిమా ల యొక్క విడుదల తేదీలను మార్చుకోవాల్సి వచ్చిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.