durga catches valteru vani while she trying to kill deepa
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 31 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1497 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాల్తేరు వాణికి తన ప్రేమ గురించి మొత్తం చెబుతుంది మోనిత. కార్తీక్ ఎవరో.. దీప ఎవరో.. శౌర్య ఎవరో.. తనకు ఆనంద్ ఎలా పుట్టాడో అన్నీ వాల్తేరు వాణికి చెబుతుంది మోనిత. దీంతో మీ ప్రేమను నేను ఎలాగైనా బతికిస్తాను. ఇవాళ రాత్రికే దీప, దుర్గ ఇద్దరిని చంపేస్తాను అని మోనితకు మాటిస్తుంది వాల్తేరు వాణి. మీరు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది. కానీ.. నువ్వు ఈ పని చేస్తే 2 లక్షలు కాదు.. 10 లక్షలు ఇస్తా అని చెబుతుంది. దీంతో మీరు క్యాష్ రెడీ చేసుకోండి. వాళ్ల అడ్డు తొలగించి మిమ్మల్ని, కార్తీక్ సార్ ను కలిపే వెళ్తాను అని అంటుంది వాణి.
durga catches valteru vani while she trying to kill deepa
మరోవైపు దీప శౌర్య కోసం పిండి వంటలు చేస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. పిండి వంటలు ఎవరి కోసం వంటలక్క అంటాడు. దీంతో రేపు పాప దగ్గరికి వెళ్తున్నాం కదా. తన కోసమే అంటుంది. ఇంతలో వాణి వస్తుంది. ఏంటి అక్కడ ఈ పిండివంటలు అంటుంది. దీంతో వాణికి విషయం చెప్పలేదా అని అడుగుతాడు. ఆ తర్వాత ఇక నేను పడుకుంటాను. ఉదయమే త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తర్వాత దీప పడుకుంటుంది. ఇక.. వాణి తన పని ప్రారంభిస్తుంది. పెట్రోల్ ను దీప పడుకున్న తర్వాత తన గుడిసె మీద పోసి నిప్పు అంటించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ.. నిప్పు అస్సలు అంటుకోదు. ఏమైంది అని అనుకుంటుంది వాణి.
ఇంతలో అక్కడికొచ్చిన దుర్గ అది పెట్రోల్ కాదు పాప.. నీళ్లు. నీళ్లు పోస్తే ఎలా అంటుకుంటుంది అని అంటాడు దుర్గ. నీ మీద నాకు అప్పుడే డౌట్ వచ్చింది అని అంటాడు. మొత్తానికి దుర్గ.. వాణిని అడ్డంగా పట్టేసుకుంటాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. నిద్ర లేచిన మోనిత.. దీప చనిపోయిందనే భ్రమలో ఉంటుంది.
కానీ.. లేచి బయటికొచ్చి చూసి షాక్ అవుతుంది. దీపకు ఏం కాలేదా.. అసలు ఈ వాల్తేరు వాణి ఎటు పోయింది అని అనుకుంటుంది మోనిత. ఇంతలో దుర్గ వచ్చి అసలు విషయం చెబుతాడు. వాల్తేరు వాణిని అడ్డం పెట్టుకొని నన్ను, దీపమ్మను చంపిద్దామనుకున్నావా.. ఈ విషయం కార్తీక్ కు చెప్పనా అంటాడు దుర్గ.
ఇంతలో కార్తీక్ రావడంతో వద్దు అని బతిమిలాడుతుంది. దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు శౌర్య దగ్గరికి వెళ్లేందుకు రెడీ అవుతుంది దీప. కార్తీక్ వచ్చి తనను చూస్తాడు. మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి అంటుంది దీప. సరే అని ఇద్దరూ రెడీ అవుతారు.
శౌర్యను కలవబోతున్నానని చాలా సంతోషంగా ఉంటుంది దీప. వాల్తేరు వాణి ఏది కనిపించడం లేదు అని అడుగుతాడు కార్తీక్. ఏమో డాక్టర్ బాబు ఉదయం నుంచి కనిపించడం లేదు అంటుంది. పిండి వంటలు అన్నీ శౌర్య కోసమేనా అంటాడు కార్తీక్. మరోవైపు శౌర్యకు పెద్దమనిషి ఫంక్షన్ చేస్తూ ఉంటారు.
ఇంతలో కారులో అక్కడ కార్తీక్, దీప దిగుతారు. ఇంద్రుడు వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్తాడు. పాపను చూడటానికి వచ్చారు. పాపను చూపించు అని ఇంద్రుడు.. చంద్రమ్మతో చెబుతాడు. దీంతో సరే అని శౌర్యను తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్తుంది చంద్రమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.