
janaki gives warning to mallika over her pregnency
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 31 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 421 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య గారు భూదేవిలా ఓర్చుకుంటారు తప్పితే తన వ్యక్తిత్వాన్ని మార్చుకోరని.. మనల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటారని, ఆ తల్లిఒడిలో సంతోషంగా ఉండాలి కానీ.. తనను బాధపెట్టాలని చూడకూడదు అని జ్ఞానాంబ చేసిన సున్నుండలు జెస్సీకి ఇచ్చి చెబుతుంది జానకి. జెస్సీ కూడా జ్ఞానాంబను పొగడ్తల్లో ముంచెత్తుతుంది. ఇవన్నీ విన్న జ్ఞానాంబ కూడా చాలా సంతోషిస్తుంది. నా కోడలు జానకి ఉన్నంత వరకు నాకు ఏం కాదు. ఈ కుటుంబాన్ని తనే సంతోషంగా చూసుకుంటుంది అని అనుకుంటుంది జ్ఞానాంబ. మరోవైపు మల్లికకు సున్నుండలు ఇచ్చేందుకు వెళ్తూ అసలు మల్లిక ప్రెగ్నెంటా కాదా.. కన్ఫమ్ చేసుకుందాం అని అనుకొని తన దగ్గర ఉన్న కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని మల్లిక దగ్గరికి వెళ్తుంది.
janaki gives warning to mallika over her pregnency
మల్లిక ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని అంటుంది. వాటిని వేసుకున్నాక ఈ సున్నుండలు తిను అంటుంది. దీంతో మల్లిక భయపడి.. ట్యాబ్లెట్స్ తర్వాత వేసుకుంటా కానీ నువ్వు వెళ్లు మల్లిక అంటుంది. దీంతో జానకికి డౌట్ వస్తుంది. జానకి వెళ్లాక మల్లిక ఆ ట్యాబ్లెట్స్ ను కింద పడేసి ఆ సున్నుండలను మాత్రం తింటుంది. దీంతో జానకికి డౌట్ వస్తుంది. ఈ నిజాన్ని ప్రూవ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ.. మల్లికకు గర్భం లేదు అని ఎలా ప్రూవ్ చేయాలని అనుకుంటుండగా రామా తనకు ఒక మంచి ఐడియా ఇస్తాడు. దీంతో తెల్లవారగానే వెంటనే లీలావతికి ఫోన్ చేసి ఉన్నపళంగా ఇంటికి రా అని అంటుంది. దీంతో లీలావతికి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో మల్లికకు ఫోన్ చేస్తుంది కానీ.. మల్లిక ఫోన్ లిఫ్ట్ చేయదు.
దీంతో వెంటనే ఇంటికి వస్తుంది లీలావతి. తను రాగానే జానకి అని పిలుస్తుంది. దీంతో జానకి తనకు కనిపించకుండా దాచుకుంటుంది. ఇంతలో మల్లిక చూసి ఇంత పొద్దున్నే ఇంటికి వచ్చి జానకిని పిలుస్తున్నావు ఏంటి అని అడుగుతుంది. దీంతో జానకి ఉదయమే ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పింది అంటుంది.
సరే.. ముందు నువ్వు ఇలారా అని పక్కకు తీసుకెళ్లి నీకు కడుపొచ్చిందని నువ్వు ఆడుతున్న దొంగనాటకం జానకికి తెలిసిపోయిందా. తెల్లవారుతూనే జానకి నాకు ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెంటనే రా అని ఫోన్ చేసి చెప్పింది అని అంటుంది.
దీంతో ఇంత పొద్దున్నే జానకి ఎందుకు ఫోన్ చేసింది అని అనుకుంటుంది జానకి. కొంపదీసి నేను ట్యాబ్లెట్లు విసిరేసింది జానకి చూసిందా ఏంటి అని అనుకుంటుంది మల్లిక. దీంతో మీరూ మీరూ బాగానే ఉంటారు. మధ్యలో నేను ఎందుకు బలి అవ్వాలి. నన్ను పోలీసులకు పట్టిస్తే.. అంతా నువ్వే చేయమన్నావు అని చెప్పేస్తా అంటుంది లీలావతి.
దీంతో మల్లికకు కోపం వస్తుంది. ఇప్పటి వరకు జానకికే కాదు.. ఎవ్వరికీ నాది దొంగ కడుపు అని తెలియదు. నిజంగా కడుపే అని నమ్మేసి నాకు సేవలు చేస్తున్నారు అంటుంది మల్లిక. ఇవన్నీ విన్న జానకి షాక్ అవుతుంది. వాళ్లకు బుద్ధి చెబుదామనుకునే లోపే అప్పుడే అక్కడికి జ్ఞానాంబ వస్తుంటుంది.
దీంతో జ్ఞానాంబను చూసి మల్లిక కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తావా అంటుంది లీలావతి. జ్ఞానాంబ వెళ్లిపోయాక మల్లికకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది జానకి. ఆ తర్వాత మల్లిక తన రూమ్ లో ఉండగా తన దగ్గరికి వెళ్తుంది జానకి.
తను పాటలు వింటూ డ్యాన్స్ చూస్తూ ఉంటుంది. ఏంటి జానకి ఇలా వచ్చావు అని అడుగుతుంది మల్లిక. దీంతో నిన్న లీలావతితో నువ్వు ఏం మాట్లాడావో తెలుసుకుందామని వచ్చా అంటుంది జానకి. దీంతో పోలేరమ్మ వీక్ నెస్ ను అడ్డం పెట్టుకొని మమ్మల్ని వేరు పడకుండా ఆపి ఇటు నీ పబ్బం గడుపుకుంటున్నావు అంటుంది మల్లిక.
ఈ కుటుంబానికి, నీకు నా ఉసురు, నా బిడ్డ ఉసురు తగలకుండా పోదు అంటూ గట్టి వార్నింగ్ ఇస్తుంది మల్లిక. దీంతో మల్లిక చెంప చెల్లుమనిపిస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
This website uses cookies.