దొరికిందే చాన్స్ అని ముద్దు పెట్టేశాడు.. వర్షను వదలని ఇమాన్యుయేల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

దొరికిందే చాన్స్ అని ముద్దు పెట్టేశాడు.. వర్షను వదలని ఇమాన్యుయేల్

ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో మొత్తం ఒకటి.. వర్ష ఇమాన్యుయేల్ టాపిక్ అంతా ఒకటి అయింది. వర్ష ఇమాన్యుయేల్ మధ్య నిజంగానే ప్రేమ ఉందా? లేదా స్కిట్ల కోసం మాత్రమే అలా యాక్ట్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఏదో ఒకటి ఉందనే అనుమానం మాత్రం అందరిలోనూ కలిగించారు. అక్కడే ఆ జంట సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈ జంటకు ఉన్న క్రేజ్‌‌ను జబర్దస్త్ టీం బాగానే క్యాచ్ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :4 January 2021,5:05 pm

ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో మొత్తం ఒకటి.. వర్ష ఇమాన్యుయేల్ టాపిక్ అంతా ఒకటి అయింది. వర్ష ఇమాన్యుయేల్ మధ్య నిజంగానే ప్రేమ ఉందా? లేదా స్కిట్ల కోసం మాత్రమే అలా యాక్ట్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఏదో ఒకటి ఉందనే అనుమానం మాత్రం అందరిలోనూ కలిగించారు. అక్కడే ఆ జంట సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈ జంటకు ఉన్న క్రేజ్‌‌ను జబర్దస్త్ టీం బాగానే క్యాచ్ చేసింది.

Emmanuel Kisses Varsha In Extra Jabardasth

Emmanuel Kisses Varsha In Extra Jabardasth

ప్రోమోలో ఈ ఇద్దరినే హైలెట్ అయ్యేలా చేస్తోంది. ప్రోమోలో దాదాపు 40 నుంచి 50 శాతం వీరిద్దరివే ఉంటున్నాయి. సూపర్ అండ్ రొమాంటిక్ యాంగిల్స్‌లో ప్రోమోను బాగానే కట్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ప్రేమికుల్లానో, వర్షను పడేసేందుకు పాట్లు పడే అబ్బాయిగానో ఇమాన్యుయేల్ స్కిట్లు వేసుకుంటున్నాడు. మొత్తానికి ఈ సారి కూడా అదే టైపులో ఓ స్కిట్ వేశాడు. ఈ వారానికి సంబంధించిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో బయటకు వచ్చింది.

ఇందులో ఇమాన్యుయేల్ వర్షను పడేసేందుకు పాట్లు పడ్డాడు. కెవ్వు కార్తీక్ కంపెనీ ఓనర్.. అందులో వర్ష ఉద్యోగం చేస్తున్నట్టు.. అందులో పని సంపాదించుకుని.. వర్షను పడేయాలాని ఇమాన్యుయేల్ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగానే గుడ్డివాడిగా నటించేస్తాడు. ఇక వర్ష పక్కనే ఉన్నా కూడా ఎక్కడా ఉందోతెలియనట్టుగా ఒళ్లంతా తడిమేస్తాడు. ఉద్యోగం ఇచ్చిన నాకు థ్యాంక్స్ చెప్పవా? అని కార్తీక్ అడిగితే.. ఇమాన్యుయేల్ వర్ష వైపు తిరిగి చేతులను ముద్దు పెట్టుకుంటాడు. మొత్తానికి వర్ష ఇమాన్యుయేల్ మధ్య మంచి కెమిస్ట్రీ సెట్ అయిందని చెప్పడానికి ఇంత కంటే మంచి సీన్ ఇంకొటి ఉండకపోవచ్చు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది