Emmanuel Satires on Anchor Rashmi Gautam Age in Extra Jabardasth Promo
Rashmi Gautam : యాంకర్ రష్మీ ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ దూసుకుపోతోంది. అన్ని షోలకు యాంకర్‌గా రష్మీనే ఉంటోంది. అందరినీ అలరిస్తోంది. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీలో అయితే రష్మీ అదరగొట్టేస్తోంది. పంచ్‌లతో అందరి మీద సెటైర్లు వేస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లో అయితే రష్మీ మీదే అందరూ కౌంటర్లు వేస్తుంటారు. స్కిట్ల మధ్యలో రష్మీ మీద సెటైర్లు పడుతుంటాయి. ఇక రష్మీ ఏజ్ మీద అయితే ఎప్పుడూ ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటారు. ఆది, రాం ప్రసాద్ వంటి వారు అయితే ఎప్పుడూ రష్మీని ఆడుకుంటూనే ఉంటారు. ఎప్పటి కాలం మనిషో అంటూ రష్మీ వయసు మీద సెటైర్లు వేస్తుంటారు.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఇమాన్యుయేల్ రెచ్చిపోయాడు. ఈ మధ్య కండక్టర్ ఝాన్సీ మల్లెమాల సంస్థలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఆమె వేసిన రికార్డింగ్ డ్యాన్స్ స్టెప్పులు ఓ రేంజ్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పల్సర్ బైక్ అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆమె వేసిన స్టెప్పులతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయింది. అయితే ఇక అవే స్టెప్పులు ఎక్కడపడితే అక్కడ వేసేస్తూ కనిపిస్తోంది. జనాలకు ఓ దశలో చిరాకు పుట్టించేస్తోంది. అయితే ఈమె ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ స్టేజ్ మీద కనిపిస్తోంది. స్కిట్లోనూ నటించేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కండెక్టర్ స్టైల్లో కామెంట్లు చేసింది. ఆడవాళ్లకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి అని అంటుంది ఝాన్సీ.
Emmanuel Satires on Anchor Rashmi Gautam Age in Extra Jabardasth Promo
ఇన్ని రోజులు అక్కడ ఆడవాళ్లే కూర్చున్నారు.. రాక రాక ఓ మగ జడ్జ్ వచ్చాడు.. అంటూ మనో గురించి ఇమాన్యుయేల్ కామెంట్ చేస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. అయితే ఇక వృద్దులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి అని అంటుంది ఝాన్సీ. ఉదయం నుంచి అక్కడే కూర్చుంటున్నారు అని రష్మీని చూపిస్తాడు ఇమాన్యుయేల్. అంటే రష్మీ వృద్దురాలు, ముసల్ది అని ఇండైరెక్ట్‌గా కౌంటర్లు వేశాడు. దీంతో రష్మీ కొట్టేస్తా అన్నట్టుగా చూసింది. మొత్తానికి రష్మీ వయసు మీద మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కౌంటర్ పడుతూనే ఉంటుంది.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.