Varsha Emmanuel : బ్యాంకాక్‌లో అలాంటి పనులు చేశావా.. వర్ష పరువుతీసిన ఇమాన్యుయేల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 23, 2021, 1:00 pm

Varsha Emmanuel : వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ బుల్లితెరపై ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎంతగా పాపులర్ అయిందో.. అంతే నెగెటివిటీని సంపాదించుకుంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా మరీ ఎక్కువ చేయడంతో మొదటికే మోసం వచ్చింది. దీంతో వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడ్డట్టు అయింది. అయితే ఈ మధ్య మళ్లీ బాగానే పుంజుకుంటున్నారు.

తాజాగా వర్ష ఇమాన్యుయేల్ కలిసి చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో, స్పెషల్ ఈవెంట్లతో వర్ష ఇమాన్యుయేల్ రొమాన్స్ మామూలుగా ఉండటం లేదు. తాజాగా వదిలిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోల వర్ష ఇమాన్యుయేల్ రెచ్చిపోయారు. భార్య భర్తల్లా నటించారు. ఇందులో వర్ష మీద వేసిన పంచ్ స్కిట్‌లో కాకుండా రియల్‌గా వేసినట్టు అనిపించింది.

Emmanuel Satires On Varsha About Bangkok In Jabardasth

Emmanuel Satires On Varsha About Bangkok In Jabardasth

Varsha Emmanuel : వర్షపై ఇమాన్యుయేల్ కౌంటర్లు

ఇందులో బ్యాంకాక్ గురించి వచ్చింది. హనీమూన్ కోసం బ్యాంకాక్‌కు టికెట్లు వేశారండి అని వర్ష అంటుంది. అక్కడికి ఎందుకే అని ఇమాన్యుయేల్ అంటాడు. బ్యాంకాక్‌లో బాగుంటుందని వర్ష అంటే..వెంటనే సెటైర్ వేసి ఆమె పరువుతీస్తాడు ఇమాన్యుయేల్. నిజం చెప్పే బ్యాంకాక్‌లో మసాజ్‌లు చేశావా? అని అడిగేస్తాడు. దీంతో వర్ష దెబ్బకు నోర్మూసుకుంటుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp