Jabardasth Promo : అనసూయ, సుధీర్‌లను పట్టుకుని రండి.. వాళ్లని పీకేయండి.. ప్రోమోపై నెటిజన్ల కామెంట్లు

Advertisement

Jabardasth Promo : జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ఇప్పుడు అంతగా రక్తి కట్టడం లేదు. జనాలు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. సుధీర్, గెటప్ శ్రీను, ఆది, అనసూయ ఇలా ఎవ్వరూ కూడా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. కొత్త వాళ్లు వస్తున్నారు.. వెళ్తున్నారు. అయితే మునుపటిలా ఆ షోలు ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం లేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మీద జనాలు నిరాసక్తిని చూపిస్తున్నారు. ఏమీ బాగా లేదని, నవ్వు రావడం లేదని అంటున్నారు.

Advertisement

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుజాత, రాకేష్ రొటీన్ రొడ్డ కొట్టుడు స్కిట్లు వేసినట్టుగా కనిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్ సినిమా షూటింగ్ అంటూ ఎప్పటిలానే స్కిట్ వేశాడు. ఇక రీల్స్ బ్యాచ్‌ను పట్టుకొచ్చి మరీ రోత పుట్టిస్తున్నారు. షార్ట్స్‌లో ఫేమస్ అయిన వాళ్లని స్టేజ్ మీదకు తీసుకొస్తున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద స్క్రాప్ ఎక్కువైందని జనాలు ట్రోల్ చేస్తున్నారు. ప్రోమోలను కూడా ఫాస్ట్ ఫార్వార్డ్‌లో చూడాల్సి వస్తుందని నెటిజన్లు అంటున్నారు.

Advertisement
Jabardasth Promo Gets Negative Comments people Want Sudheer Anasuya
Jabardasth Promo Gets Negative Comments people Want Sudheer Anasuya

ఈ మొహాలను చూడలేకపోతోన్నామని, సుధీర్, అనసూయ వంటి వాళ్లని తీసుకురండని, ఆ రాకేష్ సుజాత వంటి వాళ్లను తీసి పారేయండని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. జబర్దస్త్ స్కిట్లు, ఆర్టిస్టులు వేసే పంచులకన్నా.. కృష్ణ భగవాన్ వేసే సెటైర్లే బాగుంటాయని పరువుతీస్తున్నారు. అసలు సుధీర్ లేని షోలను చూడలేకపోతోన్నామని, త్వరగా తీసుకురండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వేరే చోట దొరక్క చంటి మళ్లీ వెనక్కి వచ్చాడు. సద్దాం గ్యాంగ్ మళ్లీ కనిపించకుండాపోయింది. జబర్దస్త్ షోల్లో ఏదేదో జరుగుతోందని నెటిజన్లు అంటున్నారు.

Advertisement
Advertisement