Ester Noronha : తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు .. నోయల్ మాజీ భార్య ఎస్తేర్ నొరోన్హా సంచలన వ్యాఖ్యలు ..!
Ester Noronha : ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఊహించిన షాక్ ఇస్తున్నాయి. మరి ముఖ్యంగా కొన్నేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు తమ బంధాన్ని కొద్ది రోజులకి ముగించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియదు గానీ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకొని వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్ది రోజులకే విడిపోయారు. అలాంటి జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇక […]
ప్రధానాంశాలు:
Ester Noronha : తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు .. నోయల్ మాజీ భార్య ఎస్తేర్ నొరోన్హా సంచలన వ్యాఖ్యలు ..!
Ester Noronha : ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఊహించిన షాక్ ఇస్తున్నాయి. మరి ముఖ్యంగా కొన్నేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు తమ బంధాన్ని కొద్ది రోజులకి ముగించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియదు గానీ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకొని వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్ది రోజులకే విడిపోయారు. అలాంటి జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇక తాజాగా రాప్ కం సింగర్ అయినా నోయల్, నటి ఎస్తేర్ నొరోన్హా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019లో వీరిద్దరూ చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పోస్ట్ వెడ్డింగ్ అంటూ చాలా పార్టీలు కూడా చేసుకున్నారు.
అయితే పెళ్లి అయిన మూడు నెలలకే ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. అయితే విడాకులకు కారణం ఏంటనేది మాత్రం బయటికి చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. పెళ్లయిన 16 రోజులకి నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అతడు ప్రతి చోట నన్ను బ్యాడ్ చేయడానికి చూశాడని, అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే అంత త్వరగా విడాకులు తీసుకున్నామని ఆమె తెలిపారు. విడాకుల తర్వాత నోయల్ తనపై చెడు ఇంపాక్ట్ పడేలా క్రియేట్ చేశాడని ఎస్తేర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకున్నా అని ఆమె ఆవేదన చెందారు. ఇక నోయల్ క్రియేట్ చేసిన చెడు ప్రభావంతో తనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయని ఆమె అన్నారు.
అంతా నాదే తప్పు అనుకోని ఒక వ్యక్తి నేను హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తానని హెచ్చరించాడని ఆమె తెలిపారు. దీంతో ఈ విషయాలు జనాల్లో హాట్ ఇష్యూ అయ్యాయని చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకునే సమయంలో కొందరు మేము ఉన్నామని ధైర్యం ఇచ్చారని, విడాకులు తీసుకుని మంచి పనే చేశానని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని ఎస్తేర్ చెప్పుకొచ్చారు. ఇక ఎస్తేర్ జయ జానకి నాయక, వెయ్యి అబద్దాలు, భీమవరం బుల్లోడు లాంటి సినిమాల్లో నటించారు. పలు సినిమాలలో హీరోయిన్గా కూడా నటించారు. అయితే ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ గుర్తింపు వచ్చినట్లుగా ఉంది. ఇక ఆమె తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించారు.