AliTho Saradaga Talk Show : ఈటీవీలో ప్రసారం అవుతున్న షో ల్లో చాలా షో లకు ఈ మద్య కాలంలో రేటింగ్ దారుణంగా తగ్గింది. ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అయ్యే షో ల్లో ఎక్కువగా జబర్దస్త్.. ఢీ మరియు క్యాష్ షో లను మాత్రమే జనాలు ఆధరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఆలీతో సరదాగా షో ను జనాలు అంతంత మాత్రంగా చూస్తూ ఉంటారు. ఇక సాయి కుమార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న వావ్ షో కు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు వావ్ షో వస్తుందని కూడా చాలా మంది మర్చి పోయారు.
అలాంటి పరిస్థితుల్లో ఈటీవీలో వస్తున్న ఆలీ టాక్ షో పరిస్థితి ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు. అదుగో ఇదుగో అంటూ ఈటీవీలో షో ల రేటింగ్ విషయంలో గతంలో వార్తలు జోరుగా వచ్చేవి. కాని ఇప్పుడు మాత్రం షో కు రేటింగ్ కు తగ్గిపోవడంతో నిర్వాహకులు పిచ్చెక్కి పోతున్నారట. ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటికే జబర్దస్త్ రెండు ఎపిసోడ్ ల రేటింగ్ తగ్గడంతో ఈటీవీ రేటింగ్ పడిపోతుంది. మరో వైపు అలీతో సరదాగా రేటింగ్ కూడా తగ్గిందని తెలుస్తోంది. గతంతో పోల్చితే అలీ టాక్ షో ను చూస్తున్న వారి సంఖ్య దాదాపుగా 32 శాతం తగ్గిందట.

ఈ సంఖ్య చిన్నదేం కాదు. షో కు వస్తున్న ఆదాయం లో దాదాపుగా సగం వరకు కోల్పోవడంతో ఇక షో రన్ చేయడం ఎలా అంటూ ఈటీవీ వారు తల పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. స్పాన్సర్స్ రాకపోవడం తో ఆలీ షో ను ముగించే యోచనలో కూడా ఈటీవీ వారు ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యూట్యూబ్ లో ఈటీవీ కంటెంట్ ఎక్కువగా వస్తున్న కారణంగా టెలికాస్ట్ అవుతున్న సమయంలో చూస్తున్న వారు తక్కువ అయ్యారు. ఈ పరిస్థితి మారాలంటే ఈటీవీ కొత్త విధానంలో అడుగు పెట్టాల్సిందే అంటున్నారు.