Jathi Ratnalu Show : ఈటీవీ అంటే ఒకప్పుడు బ్రాండ్.. ఆ టీవీలో వచ్చే షోలు.. సీరియల్స్ అన్ని కూడా టాప్ అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు పేరు గొప్ప అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు దిబ్బ అన్నట్లుగా తయారు అయ్యింది. అత్యంత దారుణమైన పరిస్థితులు ఈటీవీ ఎదుక్కొంటుంది. నెం.1 స్థానం నుండి నెం.4 స్థానం వైపుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో ఈటీవీ నుండి వచ్చిన ఈటీవీ ప్లస్ కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈటీవీ ప్లస్ లో ఆమద్య వచ్చిన పటాస్ బాగానే సక్సెస్ అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది.
ఆ ప్లేస్ లో అన్నట్లుగా జాతిరత్నాలు షో వస్తోంది. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో జబర్దస్త్ వాళ్లు చాలా మంది ఉన్నారు. వారు వెనుక వుండి నడిపిస్తున్నారు. మల్లెమాల వారు ఈ షో ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టాలెక్కించింది. కొత్త కమెడియన్స్ ఈ షో ద్వారా చాలా మంది పరిచయం అవుతారు అని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఒక్కటి అంటే ఒక్కటి ఎపిసోడ్ కూడా సక్సెస్ అవ్వడం లేదు. మరీ ఇలా నాసిరకంగా ఉందేంటి అంటూ ఈ జాతిరత్నాలు షో ను జనాలు మరియు ప్రేక్షకులు బాహాటంగానే విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
జాతిరత్నాలు కామెడీ షో కు వస్తున్న ఆధరణ జీరో అవ్వడంతో త్వరలోనే దుఖాణం మూసి వేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. వెండి తెరపై వచ్చిన జాతిరత్నాలు అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. రూపాయికి పది రూపాయిల ఫలితాన్ని ఇచ్చింది. కాని ఈ జాతి రత్నాలు మాత్రం పదిరూపాయల ఖర్చుకు కనీసం అయిదు రూపాయల ఆదాయం తీసుకు రావడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే జాతిరత్నాలు అట్టర్ ప్లాప్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. శ్రీముఖి మరియు పంచ్ ప్రసాద్ ల కోసం తాము చూస్తున్నాం అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్నారు. జాతిరత్నాలు గెటిన్ అవ్వడం దాదాపు అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.