Sekhar Master : శేఖర్ మాస్టర్‌ను కొట్టేసిన కమెడియన్.. షోలో అంతా షాక్
Sekhar Master : శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్, జడ్జ్‌గా ఫుల్ పాపులర్. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఈటీవీ, మల్లెమాలను వదిలేశాడు. స్టార్ మాకు జంప్ అయ్యాడు. అదేంటి అంటే షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే అంటూ కవర్ చేస్తున్నాడు. మరి కామెడీ స్టార్ షోకు షూటింగ్‌లు అడ్డు రావడం లేదో ఏమో. మొత్తానికి శేఖర్ మాస్టర్ అయితే డ్యాన్స్ షోలకు జడ్జ్ కాకుండా.. కామెడీ షోలకు జడ్జ్‌గా మారాడు.
తాజాగా కామెడీ స్టార్స్ ధమాకా ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఇందులో నాగబాబు రెచ్చిపోయాడు. ఒక్కో టీం లీడర్, కంటెస్టెంట్‌ను వాయించి వదిలిపెట్టేశాడు. అందరినీ కర్రతో చితకబాదేశాడు. వారిలో వారికే గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఎక్స్ ప్రెస్ హరికి వారి టీం మెంబర్లకు గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా శేఖర్ మాస్టర్‌కు దెబ్బ తగిలింది.

Express Hari Beaten sekhar Master In Comedy Stars Dhamaka
Sekhar Master : స్కిట్లో చితకబాదేసుకున్నారు..
ఎక్స్ ప్రెస్ హరికి నాగబాబు బాగా నూరి పోశాడు. సద్దాం గురించి చెప్పి కొట్టేలా తయారు చేశాడు. తీరా ఎక్స్ ప్రెస్ కర్ర అందుకుని సద్దాంను కొట్టబోయాడు. కానీ సద్దాంను శేఖర్ మాస్టర్ పట్టుకుని ఉండటం వల్ల.. ఆ దెబ్బ కాస్త శేఖర్ మాస్టర్‌కు తగిలింది. ఎక్స్ ప్రెస్ హరి కొట్టిన దెబ్బకు శేఖర్ మాస్టర్ అరిచేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సారీ మాస్టర్ అని ఎక్స్ ప్రెస్ హరి అనేశాడు.
