Hyper Aadi : భూమిక‌తో శేఖ‌ర్ మాస్ట‌ర్ సీక్రెట్ ఎవ్వారం బ‌య‌ట‌పెట్టిన హైప‌ర్ ఆది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hyper Aadi : భూమిక‌తో శేఖ‌ర్ మాస్ట‌ర్ సీక్రెట్ ఎవ్వారం బ‌య‌ట‌పెట్టిన హైప‌ర్ ఆది..!

Hyper Aadi  : ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న టీవీ షోల‌లో ఢీ ఒక‌టి. ఈ డ్యాన్స్ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది.శేఖ‌ర్ మాస్ట‌ర్, ప్ర‌ణీత జడ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి ఆద‌ర‌ణ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. అయితే షోలో శేఖ‌ర్ మాస్ట‌ర్ చేసే సంద‌డి అందరికి వినోదం పంచుతుంటుంది. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌రోవైపు డాన్స్ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నాడు. హీరోయిన్‌ ప్రణతితో కలిసి శేఖర్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 May 2024,7:52 pm

ప్రధానాంశాలు:

  •  Hyper Aadi : భూమిక‌తో శేఖ‌ర్ మాస్ట‌ర్ సీక్రెట్ ఎవ్వారం బ‌య‌ట‌పెట్టిన హైప‌ర్ ఆది..!

Hyper Aadi  : ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న టీవీ షోల‌లో ఢీ ఒక‌టి. ఈ డ్యాన్స్ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది.శేఖ‌ర్ మాస్ట‌ర్, ప్ర‌ణీత జడ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి ఆద‌ర‌ణ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. అయితే షోలో శేఖ‌ర్ మాస్ట‌ర్ చేసే సంద‌డి అందరికి వినోదం పంచుతుంటుంది. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌రోవైపు డాన్స్ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నాడు. హీరోయిన్‌ ప్రణతితో కలిసి శేఖర్‌ మాస్టర్‌ జడ్జ్ గా ఢీ షోకి వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా శేఖర్‌ మాస్టర్‌ బండారం బయటపెట్టాడు హైపర్‌ ఆది. ఆయన ఫోన్‌ కొట్టేసి ఆ సక్రెట్స్ అన్ని బయటపెట్టాడు.

Hyper Aadi  : బండారం బ‌ట్ట‌బ‌య‌లు..

ఇందులో హీరోయిన్లతో టచ్‌లో ఉన్నట్టు వెల్లడించాడు. హీరోయిన్‌ భూమిక నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్ ఉన్నాయట. వరుసగా వస్తూనే ఉందట. ఏంటీ సామీ ఇది అని ప్రశ్నించాడు ఆది. దీనికి శేఖర్‌ మాస్టర్‌ నుంచి సమాధానం లేదు. మరోవైపు శేఖర్‌ మాస్టర్‌ ఫోన్‌ చేసిన డాటా తీస్తే, నందిత, ప్రియమణి, పూర్ణ, శ్రద్ధా దాస్‌, ప్రణీత లకు ఫోన్లు చేశాడట శేఖర్‌ మాస్టర్‌. అయితే ప్రణీత జడ్జ్ అని భావించగా, ఆమె కాదని, డైరెక్షన్‌ డిపార్ట్ మెంట్‌ అని చెప్పడం విశేషం. ఇక శేఖర్‌ మాస్టర్ రోజూ ఏం చేస్తాడో కూడా ఫోన్‌లో ఉందట. 15 మినిట్స్ వాకింగ్‌, అర్థగంట ట్రెకింగ్‌ అని, మరో అరగంట ఇంకేదో ఇంగ్‌ ఉందని హైప‌ర్ ఆది చెప్పి అంద‌రిలో అయోమ‌యం క‌లిగించాడు. ఆ త‌ర్వాత డ్యాన్సింగ్ అని చెప్పాడు.

Hyper Aadi భూమిక‌తో శేఖ‌ర్ మాస్ట‌ర్ సీక్రెట్ ఎవ్వారం బ‌య‌ట‌పెట్టిన హైప‌ర్ ఆది

Hyper Aadi : భూమిక‌తో శేఖ‌ర్ మాస్ట‌ర్ సీక్రెట్ ఎవ్వారం బ‌య‌ట‌పెట్టిన హైప‌ర్ ఆది..!

మొత్తానికి శేఖర్‌ మాస్టర్‌ ఫోన్ లోని సీక్రెట్స్ అని బయటపెట్టిన హైప‌ర్ ఆది ఒక్క‌సారిగా ఆయ‌న‌కు గుండెలు గుబేల్ మ‌ని అనిపించాడు. ఇదే క్ర‌మంలో హైప‌ర్ ఆది ఫోన్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌కి దొర‌క‌డంతో అందులో గుట్టు బ‌య‌ట‌పెట్టాడు. రసిక రాణితో, జింగిడి జ్యోతితో చాట్‌ చేశాడట. అందులో ఏముందో చెప్పి రచ్చ లేపాడు శేఖర్‌ మాస్టర్‌. దెబ్బకి ఆయన వద్దకు వచ్చి ఫోన్‌ లాగేసుకున్నాడు ఆది. కామెడీ కోసం చేసిన ఈ స్కిట్ నవ్వులు పూయించింది. చివర్లో జడ్జ్ ప్రణీతని ఆడుకున్నాడు యాంకర్‌ నందు. ఆమెచేత ఓ వ్యాఖ్యం చెప్పించాడు. కప్ప పక్కన కుంప, కుంప పక్కన కప్ప` అని కంటిన్యూగా చెప్పాలి. దీంతో ప్రారంభంలో త‌డ‌బ‌డిన ప్ర‌ణీత రెండో సారి చెప్పి దానిని రిపీట్ గా వేసుకోవాల‌ని చెప్పి వినోదం పంచింది. మొత్తానికి ఈ స్కిట్ న‌వ్వులు పంచింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది