Sekhar Master : మాకు అది తప్ప ఏమి రాదు.. కన్నీరు పెట్టుకున్న శేఖర్ మాస్టర్
ప్రధానాంశాలు:
Sekhar Master : మాకు అది తప్ప ఏమి రాదు.. కన్నీరు పెట్టుకున్న శేఖర్ మాస్టర్
Sekhar Master : బుల్లితెరపై పలు రియాలిటీ షోలు తెగ సందడి చేస్తుండగా, వాటిలో ఢీ షో ప్రత్యేకం అని చెప్పాలి. సక్సెస్ ఫుల్ గా 17 సీజన్లను పూర్తి చేసుకున్న ఢీ షో ఇటీవల ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ సీజన్ లో అడుగుపెట్టింది. ఈ షోకి శేఖర్ మాస్టర్, హన్సిక, గణేష్ మాస్టర్ లు జడ్జిలుగా ఉండగా.. హైపర్ ఆది, శ్రీ సత్య టీమ్ లీడర్లుగా ఉన్నారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డ్యాన్స్ షోకి హోస్ట్ గా ఉన్న నందునే ఇక ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్లు తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక హైపర్ ఆది తనదైన పంచులతో షోని రక్తి కట్టిస్తున్నారు.ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో డ్యాన్స్ తో పాటు కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయని తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ఎపిసోడ్ ప్రోమోలో శేఖర్ మాస్టర్, ఇంకో డ్యాన్స్ మాస్టర్ కూడా ఏడవడంతో ప్రోమో వైరల్ గా మారింది.
Sekhar Master ఎంత బాధ..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మధు అనే కంటెస్టెంట్ పక్కన డ్యాన్సర్లు తప్పు వేయడంతో మధ్యలో పర్ఫార్మెన్స్ ఆపేసారు. దీంతో శేఖర్ మాస్టర్ దీని గురించి మాట్లాడారు. ఆ పర్ఫార్మెన్స్ ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ స్టేజిపైకి వచ్చాక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. మేము డ్యాన్సర్లు కదా. మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏం రాదు. డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడో, మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ వర్క్ పోతుందో అని భయపడేవాళ్ళం అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు.శేఖర్ మాస్టర్ మాటలకు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ పర్ఫార్మెన్స్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ కూడా స్టేజిపైనే ఏడ్చేశాడు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత ఆకలితో అయితే ఉన్నారో.. ఎంత కష్టపడి పనిచేశారో.. క్రేజ్ వచ్చిన తర్వాత కూడా అంతే ఆకలితో, అంతే కష్టపడేతత్వంతో ఉంటారు. మొదట్లో ఉన్న అంకితభావాన్ని అలానే కొనసాగిస్తుంటారు. శేఖర్ మాస్టర్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు. చేసే పనిని ఎంతో అంకితభావంతో పని చేయాలన్న ఉద్దేశంతో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు.ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రోమోకి సంబంధించిన ఎపిసోడ్ జూలై 10, 11 తేదీల్లో ప్రసారం కానుంది.