Sarayu : సరయును అక్కడ పట్టుకున్న ఎక్స్ ప్రెస్ హరి.. దెబ్బకు అంతా షాక్
Sarayu ఎక్స్ ప్రెస్ హరి ఇప్పుడు బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్నాడు. అషూ రెడ్డి పుణ్యమా అంటూ ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు పటాస్ షోలో బాగానే క్లిక్ అయ్యాడు. ఆ తరువాత అదిరింది షోలో కనిపించాడు. కానీ ఆ షో అటకెక్కడంతో.. ఇప్పుడు కామెడీ స్టార్స్‌లో దుమ్ములేపుతున్నాడు. అయితే అషూ రెడ్డితో నడిపించే ట్రాకుతోనే హరి ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. మరీ ముఖ్యంగా టాటూ ఎపిసోడ్, ఆ నాటకంతో మామూలు క్రేజ్ దక్కలేదు.

Express Hari Touches Sarayu
ఇప్పటికే అషూ టాటూ నిజమా? కాదా? అని అందరూ జుట్టు పీక్కుంటుంటారు. కానీ తన ప్రతీస్కిట్‌లో అషూ టాటూను చూపిస్తాడు. తన గుండెల మీద ఎప్పటికీ ఆ టాటూ ఉంటుందని చెబుతాడు. అయితే తాజాగా హరిని ఆడుకునేందుకు సరయు ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో దడదడలాడించిన సరయు.. కామెడీ స్టార్స్ స్టేజ్‌ను రఫ్పాడించింది. సూర్యుడు మండుతూ ఉండాలి.. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉండాలి.. అందరూ ఈ సరయు కంట్రోల్‌లో ఉండాలని డైలాగ్ చెబుతూ సరయు ఎంట్రీ ఇచ్చింది.
Sarayu సరయు తొడలు పట్టుకున్న హరి

Express Hari Touches Sarayu
అయితే ఈ స్కిట్‌లో భాగంగా హరిని సరయు ఆడుకుంది. దారుణంగా కొట్టేసింది. సరయు మీద పంచ్ వేయడంతో హరిని చెంపదెబ్బ కొట్టేసింది. ఇక చివర్లో మళ్లీ నడ్డి మీద కాలు ఎత్తి మరీ తన్నేసింది. అలా దెబ్బకు హరి అంత దూరంలో పడిపోయాడు. దీంతో ఆవేశంలో హరి సరయుకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంకోసారి కొట్టావ్ అనుకో అని అంటే.. ఆ కొట్టాను ఏంటి అని సరయు మీద మీదకు వచ్చింది. దీంతో ఆమె తొడను పట్టుకుని హరి లొంగిపోయాడు. టైం చూసి ఇలా పట్టుకున్నాడు అంటూ సరయు అతడి మీద ఆరోపణలు చేసింది.
