Bigg Boss OTT Telugu : సరయు బయటకు వచ్చి బిందు మాధవి గురించి చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా?
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదవ వారంలో కి అడుగు పెట్టింది. మొదటి వారంలో ముమైత్ఖాన్ రెండవ వారంలో శ్రీ రాపాక మూడవ వారంలో రేడియో జాకీ చైతు ఎలిమినేట్ అవ్వగా తాజాగా నాల్గవ వారంలో సరయు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. గత సీజన్లో సరయు మొదటి వారంలోనే ఎలిమినేట్ అవడంతో ఆమె అభిమానులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈసారి నాలుగు వారాల పాటు ఆమె హౌస్లో కొనసాగడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయినా ఇంకొన్ని రోజులు ఆమె ఉండే అవకాశం ఉంది అని నిర్వాహకులు ఆమెను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వాహకులు మాత్రం ఎప్పటిలాగే ఓటింగ్ ఆధారంగానే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుందని ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని చెబుతూ వస్తున్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ లు యాంకర్ రవి కి ఇచ్చే ఇంటర్వ్యూ లో భాగంగా సరయు కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను గురించి చెప్పుకొచ్చింది. అఖిల్ గురించి మాట్లాడుతూ వేరే వాళ్ళతో కలిసి ఆడటం మానేసి ఉంటే బాగుంటుంది అని చెప్పింది.ఇక అరియానా బయట కనిపిస్తే పట్టుకుని కొడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Sarayu comments on Bigg Boss OTT Telugu Bindu madhavi
మహేష్ విట్టా, నట్రాజ్ మాస్టర్ ఇలా ఇద్దరు ముగ్గురు కి సంబంధించిన పాజిటివ్ వ్యాఖ్యలు చేసింది. అయితే బిందు మాధవి గురించి మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆట ఆడాలి అంటే బిందు మాధవి లాంటి కంటెస్టెంట్ హౌస్ లో ఉండాలి అంటూ సరయు చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానులకు కిక్ ఇచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో బింధు మాధవి గురించి సరయు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి .బిందు మాధవి ఆర్మీ సభ్యులు ఆ వీడియోని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు.